Vaishakha Amavasya 2023: ఈరోజు ఏప్రిల్ 20న వైశాఖ అమావాస్య వచ్చింది, ఇదే రోజున సూర్యగ్రహణం సంభవించింది. అమావాస్య చంద్రుడు ఈరోజు సూర్యగ్రహణానికి (Solar Eclipse 2023) కారణం అవుతున్నాడు. జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఇది చాలా అరుదైన సంఘటన. ఈరోజు సూర్యగ్రహణం ఉదయం 07:04 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:29 గంటలకు ముగుస్తుంది. అయితే, సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించనందున, ఇక్కడ సూతక కాలం అనేది లేదు. అందువల్ల వైశాఖ అమావాస్య సందర్భంగా నిర్వహించే అన్ని ఆచారాలను పంచాంగం ప్రకారం నిర్వహించవచ్చుకోవచ్చునని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అధ్యాత్మికవేత్తల ప్రకారం, వైశాఖ అమావాస్య తిథి నాడు వివిధ పరిహారాలను ఆచడం ద్వారా పితృ దోషం నుంచి బయటపడవచ్చు. పితృ దోషం కలిగి ఉండటం వలన జీవితంలో అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవలసి ఉంటుంది. మొత్తం కుటుంబం పురోగతి దెబ్బతింటుంది. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం అమావాస్య నాడు పడుతున్నందున, సూర్యగ్రహణం ముగిసే ముందు లేదా గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని పరిహారాలు పాటిస్తే, పిత్ర దోషం తొలగిపోతుంది. పితృ దోషం నుండి విముక్తి పొందడానికి ఎలాంటి ఆచారాలు పాటించాలో ఇక్కడ తెలుసుకోండి.
జ్యోతిష్యుల ప్రకారం, పూర్వీకులను సంతృప్తిపరచడం ద్వారా వారి వారసులకు, పిల్లలకు వారి తర్వాతి తరాలకు వారి ఆశీస్సులు లభిస్తాయి. ఇది వారి పురోగతికి, సంతోషకరమైన జీవితానికి దోహదపడుతుంది. పూర్వీకులు శాంతి సంతృప్తి పొందకపోతే, అది ఎల్లప్పుడూ పితృ దోషం శాపం రూపంలో ఉంటుంది. ఇది కుటుంబ ప్రగతిపై ప్రభావం పడుతుంది.
సంబంధిత కథనం
టాపిక్