మార్చి 23, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు-today rasi phalalu march 23rd 2024 check your zodiac signs result for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu March 23rd, 2024 Check Your Zodiac Signs Result For Daily Horoscope In Telugu

మార్చి 23, నేటి రాశి ఫలాలు.. ఈ రాశి జాతకులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు

HT Telugu Desk HT Telugu
Mar 23, 2024 12:04 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ23.03.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మార్చి 23వ తేదీ నేటి రాశి ఫలాలు
మార్చి 23వ తేదీ నేటి రాశి ఫలాలు (freepik )

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 23.03. 2024

ట్రెండింగ్ వార్తలు

వారం: శనివారం, తిథి : త్రయోదశి,

నక్షత్రం : పుబ్బ, మాసం : ఫాల్గుణం

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా పట్టుదలతో కృషిచేయండి. పనుల్లో ఒత్తిడి ఇబ్బందిపెట్టును. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. మిత్రులకు సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కలుగును. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. అవకాశాల్ని సద్వినిగయోగం చేసుకోవాలి. గృహ, వాహన యోగాలుంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలించును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్థులకు ఖర్చులతో కూడినటువంటి సమయం. వృషభ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇతరులపై ఆధారపడవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. స్వల్ప ఇబ్బందులున్నా అధైర్యపడకూడదు. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. మనోబలంతో పనిచేయండి. అన్నింటా విజయాలు సిద్ధిస్తాయి. శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉండును. వ్యాపారస్తులకు కొంత కష్టకాలం. విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు, వృత్తి, కుటుంబ సమస్యలు ఇబ్బందిపెడతాయి. కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయూలయందు జాగ్రత్తలు వహించాలి. దశరథ ప్రోక్త శనిస్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా ఇబ్బందులుంటాయి. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యవిషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. సింహ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. మీ ఆశయాలు నెరవేరతాయి. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు లాభదాయకం. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి తగిన సమయం. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించడం మంచిది. కన్యా రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. భూ, గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ కృషి నలుగురికీ తెలుస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా లాభదాయకం. మీరు చేసే పనులు పదిమందికి ఆదర్శవంతమవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. స్వయంకృషితో అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడును. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

ధనూ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. ఏ పని ప్రారంభించినా విజయమే గోచరిస్తుంది. తగిన ప్రణాళికలను సిద్ధం చేయండి. గొప్పవారితో సంభాషిస్తారు. గృహ నిర్మాణాది కార్యాలు సత్ఫలితాలిస్తాయి. విద్యార్థులకు ఈరోజు కలసివచ్చును. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. మీరు చేపట్టిన పనులు పూర్తవుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. మకర రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథ ప్రోక్త శనిస్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. మీ జీవిత భాగస్వామితో కలసి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలించును. ఉద్యోగస్తులకు అధికారులనుండి సహాయ సహకారాలుంటాయి. వృత్తి వ్యాపారపరంగా ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. కుంభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో తోటివారి నుండి తగిన సహాయం అందుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొన్ని విషయాలలో స్పష్టత వస్తుంది. భూలాభం సూచన. మనశ్శాంతి లభిస్తుంది. ప్రతిభతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. మీన రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ