ఫిబ్రవరి 24, 2024: నేటి రాశి ఫలాలు.. ఆరోగ్యం జాగ్రత్త, శత్రుదోషం తొలగిపోతుంది-today rasi phalalu february 24th 2024 check your zodiac signs future prediction for daily horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Today Rasi Phalalu February 24th 2024 Check Your Zodiac Signs Future Prediction For Daily Horoscope In Telugu

ఫిబ్రవరి 24, 2024: నేటి రాశి ఫలాలు.. ఆరోగ్యం జాగ్రత్త, శత్రుదోషం తొలగిపోతుంది

HT Telugu Desk HT Telugu
Feb 24, 2024 12:05 AM IST

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ24.02.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

ఫిబ్రవరి 24, నేటి రాశి ఫలాలు
ఫిబ్రవరి 24, నేటి రాశి ఫలాలు (freepik)

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 24 02.2024

ట్రెండింగ్ వార్తలు

వారం: శనివారం, తిథి : పౌర్ణమి,

నక్షత్రం : మఖ, మాసం : మాఘము

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విజయావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవీయోగం. అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది. పెట్టుబడులు కలసి వస్తాయి. కీర్తిప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారపరంగా జాగ్రత్త వహించాలి. మరింత శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, సుప్రభాతం వినడం చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. సకాలంలో పనిచేస్తే కార్యసిద్ధి లభిస్తుంది. బాధ్యతలను ధైర్యంగా, జాగ్రత్తగా నిర్వర్తించండి. అసూయాపరులు విఘ్నాలు కలిగించాలని చూస్తారు. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. సమయస్ఫూర్తితో ఆటంకాలను అధిగమించాలి. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. లక్ష్యంపై దృష్టిపెట్టి ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో సంచరిస్తున్నాయి. ఏకాగ్రతతో పనిచేయాలి. ఒత్తిడికి గురికారాదు. అడుగడుగునా ఇబ్బంది కలిగించే పరిస్థితులుంటాయి. జాగ్రత్తగా అధిగమించాలి. మీరు చేసే ప్రయత్నానికి అనుగుణంగా ఫలితం ఉంటుంది. కొన్ని పనులు ఆగుతాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. ముఖ్య పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. నిజాయితీగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించండి. మౌనంగా ఉండాలి. ప్రతి పని ఇంట్లో వారితో చర్చించి చేయాలి. మానసికంగా దృథంగా ఉండాలి. నిరుత్సాహం పనికిరాదు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి, నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. పలుమార్గాల్లో విజయాలు లఖిస్తాయి. స్వల్ప ప్రయత్నంతోనే విశేష లాభాలు సమకూరుతాయి. ప్రశాంత చిత్తంతో పనిచేసి లక్ష్యాలను పూర్తిచేయండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. తోటివారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. గృహ నిర్మాణాది పనుల్లో శుభఫలితాలు ఉంటాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, సుప్రభాతం వినడం, చదవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారంలో సకాలంలో జాగ్రత్తపడితే లాభాలు పొందవచ్చు. తోటివారి సహకారం తీసుకోవాలి. చంచలత్వం ఇబ్బంది పెడుతుంది. శత్రుదోషం తొలగుతుంది. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి. సంపదలు పెరుగుతాయి. విశేషంగా కృషి చేయండి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

తులా రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం తులా రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. సకాలంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థికంగా వృద్ధి చెందుతారు. మొహమాటంతో ఖర్చుల్ని పెంచుకోకూడదు. వ్యాపారంలో కలసివస్తుంది. ఉద్యోగంలో మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మీవల్ల కొందరికి మేలు జరుగుతుంది. భూ, గృహ వాహనయోగాలు ఫలిస్తాయి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులకు ఈ రోజు మీకు శుభఫలితాలున్నాయి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. భూలాభం సూచితం. నూతన ప్రయత్నాలు కలసివస్తాయి. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఉత్సాహంగా నిర్ణయాలను అమలు చేయండి. మంచి భవిష్యత్తు ఉంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యాపార నిర్ణయాలను ఆలోచించి తీసుకోండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. పలుమార్గాలలో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగాలి. ఆశించిన ధనలాభముంటుంది. పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. మిత్రుల అండ లభిస్తుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం, సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. బాధ్యతాయుతంగా సకాలంలో పనులు పూర్తి చేయండి. గ్రహ బలం అనుకూలించడం లేదు. ముందస్తు ప్రణాళికలు మేలుచేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఒంటరిగా ఏ పనీ చేయవద్దు. సమిష్టి కృషి అవసరం. ఏ విషయంలోనూ తొందర పనికిరాదు. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మనోబలంతో పనులు ప్రారంభించండి. త్వరగా పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కృషిని బట్టి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలి. ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకుంటూ ఆటంకాలను అధిగమించాలి. చెడు ఊహించకుండా పనిచేస్తే వ్యాపారంలో కలసి వస్తుంది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాలి. లింగాష్టకాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. క్రమంగా వృద్ధిలోకి వస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. వ్యాపారం కలసి వస్తుంది. తోటివారి సహకారంతో నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. భూ, గృహ, వాహన ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel