శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి.. కష్టాలను కడతేర్చే స్త్రోత్రం-sri lalitha ashtottara shatanamavali in telugu read here to get relief from your sufferings ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Sri Lalitha Ashtottara Shatanamavali In Telugu Read Here To Get Relief From Your Sufferings

శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి.. కష్టాలను కడతేర్చే స్త్రోత్రం

HT Telugu Desk HT Telugu
May 22, 2023 11:38 AM IST

శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి చదివితే ఎన్ని కష్టాల్లో ఉన్నా మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. అమ్మవారి ఈ స్త్రోత్ర పారాయణం చేయడం వల్ల మీ మనసు కుదుటపడుతుంది.

శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి పారాయణంతో జగన్మాత కృప
శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి పారాయణంతో జగన్మాత కృప

లలితా అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల మీరు పడుతున్న కష్టాల నుంచి విముక్తి పొందుతారు. సమస్త ధోషాలు, పాపాలు తొలగిపోతాయి. అన్ని స్తోత్రాల్లో లలితా అష్టోత్తర శతనామావళి, లలిత సహస్ర నామావళి అత్యంత శక్తిమంతమైనవి. ఇవి చదవడం వల్ల అంధకారంలో కూరుకుపోయిన మీ జీవితంలో వెలుగులు మొదలవుతాయి. ఈ జీవితం ఇక నావల్ల కాదు అనే స్థితిలో ఉన్నా సరే.. మీరు మళ్లీ పునరుజ్జీవం పొందుతారు. లలితా అష్టోత్తర శతనామావళి ఇక్కడ చదవండి.

ట్రెండింగ్ వార్తలు

శ్రీ బాలాత్రిపురసుందర్యై నమః

శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః

ఓం ఐం - హ్రీం శ్రీం నమో నమః

లలితా అష్టోత్తర శతనామావళి

 1. ఓం రజతాచలశృంగా గ్రమధ్యస్థాయై నమో నమః
 2. ఓం హిమాచలమహావంశపావనాయై నమో నమః
 3. ఓం శంకరార్ధాంగ సౌందర్యశరీరాయై నమో నమః
 4. ఓం లసన్మరకతస్వచ్ఛవిగ్రహాయై నమో నమః
 5. ఓం మహాతిశయ సౌందర్యలావణ్యాయై నమో నమః
 6. ఓం శశాంకశేఖరప్రాణవల్లభాయై నమో నమః
 7. ఓం సదాపంచదశాత్మైక్యస్వరూపాయై నమో నమః
 8. ఓం వజ్రమాణిక్యకటకకిరీటాయై నమో నమః
 9. ఓం కస్తూరీతిలకోల్లాసి నిటలాయై నమో నమః
 10. ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమో నమః
 11. ఓం వికచాంభోరుహదళలోచనాయై నమో నమః
 12. ఓం శరచ్చాంపేయ పుష్పాభనాసికాయై నమో నమః
 13. ఓం లసత్కాంచన తాటంకయుగళాయై నమో నమః
 14. ఓం సంకాశ కపోలాయై మణిదర్పణ నమో నమః
 15. ఓం తాంబూలపూరిత స్మేరవదనాయై నమో నమః
 16. ఓం సుపక్వదాడిమీబీజరదనాయై నమో నమః
 17. ఓం కంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమో నమః
 18. ఓం స్థూలముక్తాఫలోదారసుహారాయై నమో నమః
 19. ఓం గిరీశబద్ధమాంగల్యమంగళాయై నమో నమః
 20. ఓం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమో నమః
 21. ఓం పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః
 22. ఓం సువర్ణకుంభయుగ్మాభ సుకుచాయై నమో నమః
 23. ఓం రమణీయచతుర్భాహు సంయుక్తాయై నమో నమః
 24. ఓం కనకాంగద కేయూరభూషితాయై నమో నమః
 25. ఓం బృహత్సౌవర్ణసౌందర్యవసనాయై నమో నమః
 26. ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమో నమః
 27. ఓం సౌభాగ్యజాత శృంగారమధ్యమాయై నమో నమః
 28. ఓం దివ్యభూషణసందోహ రంజితాయై నమో నమః
 29. ఓం పారిజాతగుణాధిక్య పదాబ్జాయై నమో నమః
 30. ఓం సుపద్మరాగసంకాశ చరణాయై నమో నమః
 31. ఓం కామకోటి మహాపద్మపీఠస్థాయై నమో నమః
 32. ఓం శ్రీకంఠ నేత్రకుముద చంద్రికాయై నమో నమః
 33. ఓం సచామర రమావాణీ విరాజితాయై నమో నమః
 34. ఓం భక్తరక్షణ దాక్షిణ్యకటాక్షాయై నమో నమః
 35. ఓం భూతాలింగనోద్భూతపులకాంగ్యై నమో నమః
 36. ఓం అనంగజనకాపాంగ వీక్షణాయై నమో నమః
 37. ఓం బ్రహ్మోపేంద్రశిరోరత్న రంజితాయై నమో నమః
 38. ఓం శచీముఖ్యామర వధూ సేవితాయై నమో నమః
 39. ఓం లీలాకల్పిత బ్రహ్మాండమండలాయై నమో నమః
 40. ఓం అమృతాది మహాశక్తిసంవృతాయై నమో నమః
 41. ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః
 42. ఓం సనకాది సమారాధ్యపాదుకాయై నమో నమః
 43. ఓం దేవర్షభిస్తూయమాన వైభవాయై నమో నమః
 44. ఓం కలశోద్భవ దుర్వాసపూజితాయై నమో నమః
 45. ఓం మత్తేభవక్త్ర షడ్వక్రవత్సలాయై నమో నమః
 46. ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమో నమః
 47. ఓం చిదగ్నికుండసంభూత సుదేహాయై నమో నమః
 48. ఓం శశాంకఖండ సంయుక్త మకుటాయై నమో నమః
 49. ఓం మత్తహంసవధూ మందగమనాయై నమో నమః
 50. ఓం వందారుజనసందోహ వందితాయై నమో నమః
 51. ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః
 52. ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః
 53. ఓం అవ్యాజకరుణాపూరపూరితాయై నమో నమః
 54. ఓం నితాంత సచ్చిదానందసంయుక్తాయై నమో నమః
 55. ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః
 56. ఓం రత్నచింతామణి గృహమధ్యస్థాయై నమో నమః
 57. ఓం హానివృద్ధి గుణాధిక్యరహితాయై నమో నమః
 58. ఓం మహాపద్మాటవీమధ్య నివాసాయై నమో నమః
 59. ఓం జాగ్రత్స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః
 60. ఓం మహాపాపౌఘ పాపానాం వినాశిన్యై నమో నమః
 61. ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమో నమః
 62. ఓం సమస్తదేవ దనుజప్రేరకాయై నమో నమః
 63. ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః
 64. ఓం అనాహతమహాపద్మమందిరాయై నమో నమః
 65. ఓం సహస్రార సరోజాతవాసితాయై నమో నమః
 66. ఓం పునరావృత్తిరహిత పురస్థాయై నమో నమః
 67. ఓం వాణీగాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః
 68. ఓం రమా భూమిసుతారాధ్యపదాబ్జాయై నమో నమః
 69. ఓం లోపాముద్రార్చిత శ్రీ మచ్చరణాయై నమో నమః
 70. ఓం సహస్రరతిసౌందర్య శరీరాయై నమో నమః
 71. ఓం భావనామాత్ర సంతుష్టహృదయాయై నమో నమః
 72. ఓం సత్యసంపూర్ణ విజ్ఞానసిద్ధిదాయై నమో నమః
 73. ఓం శ్రీలోచనకృతోల్లాస ఫలదాయై నమో నమః
 74. ఓం శ్రీ సుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమో నమః
 75. ఓం దక్షాధ్వర వినిర్భేదసాధగాయై నమో నమః
 76. ఓం శ్రీనాథసోదరీభూత శోభితాయై నమో నమః
 77. ఓం చంద్రశేఖరభక్తార్తి భంజనాయై నమో నమః
 78. ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః
 79. ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః
 80. ఓం సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః
 81. ఓం శ్రీ షోడశాక్షరీమంత్ర మధ్యగాయై నమో నమః
 82. ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః
 83. ఓం భక్తహంస పరీముఖ్య వియోగాయై నమో నమః
 84. ఓం మాతృమండలసంయుక్త లలితాయై నమో నమః
 85. ఓం భండదైత్యమహసత్త్వనాశనాయై నమో నమః
 86. ఓం క్రూరభండ శిరశ్ఛేద నిపుణాయై నమో నమః
 87. ఓం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః
 88. ఓం చండముండనిశుంభాదిఖండనాయై నమో నమః
 89. ఓం రక్తాక్షరక్తజిహ్వాది శిక్షణాయై నమో నమః
 90. ఓం మహిషాసుర దోర్వీర్యనిగ్రహాయై నమో నమః
 91. ఓం అభ్రకేశమహోత్సాహకారణాయై నమో నమః
 92. ఓం మహేశయుక్త నటనతత్పదాయై నమో నమః
 93. ఓం ఓం నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై నమో నమః
 94. ఓం వృషభధ్వజ విజ్ఞానభావనాయై నమో నమః
 95. ఓం జన్మమృత్యుజరారోగ భంజనాయై నమో నమః
 96. ఓం విధేయముక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః
 97. ఓం కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమో నమః
 98. ఓం రాజరాజార్చిత పదసరోజాయై నమో నమః
 99. ఓం సర్వవేదాంత సంసిద్ధ సుతత్త్వాయై నమో నమః
 100. ఓం శ్రీ వీరభక్తవిజ్ఞాన నిధానాయై నమో నమః
 101. ఓం అశేష దుష్ట దనుజసూదనాయై నమో నమః
 102. ఓం సాక్షాచ్ఛీదక్షిణామూర్తి మనోజ్జాయై నమో నమః
 103. ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమ్నే నమో నమః
 104. ఓం దక్షప్రజాపతి సుతవేషాఢ్యాయై నమో నమః
 105. ఓం సుమబాణేక్షు కోదండమండితాయై నమో నమః
 106. ఓం నిత్యయౌవన మాంగల్య మంగళాయై నమో నమః
 107. ఓం నుహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః
 108. ఓం మహాదేవరతౌత్సుక్య మహాదేవ్యై నమో నమః

శ్రీ లలితాష్టోత్తరశతనామావళి సమాప్తం

WhatsApp channel

టాపిక్