శ్రావణ మాసం.. అనుబంధాలను పటిష్టం చేసే ఆధ్యాత్మిక మాసం ప్రారంభం-shravana masam the beginning of the spiritual month of strengthening attachments ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శ్రావణ మాసం.. అనుబంధాలను పటిష్టం చేసే ఆధ్యాత్మిక మాసం ప్రారంభం

శ్రావణ మాసం.. అనుబంధాలను పటిష్టం చేసే ఆధ్యాత్మిక మాసం ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Aug 17, 2023 08:57 AM IST

నేడు నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభమైంది. అనుబంధాలను పటిష్టం చేసే ఈ ఆధ్యాత్మిక మాసం గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఈనెలలోనే రక్షాబంధన్
ఈనెలలోనే రక్షాబంధన్

అధ్యాత్మిక దృష్టితో ఆలోచించిపుడు వర్ష బుతువు అనగా శ్రావణ, భాద్రపద మాసముల కాలం, వేదాధ్యయన కాలం. అసలు శ్రావణమనే ఈ మాస నామము నందే వేదకాలమనే అర్ధం ఉన్నదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రవణమనగా “వినుట”అని అర్థం. వేదము గ్రంధము వలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. దీనిని వినిపించేవాడు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. ఈ వేదమునకే స్వాధ్యాయమనేది మరో నామం. వేదాధ్యయనం చేసే వానికి మోహం తొలగి, బ్రహ్మ స్వరూపం ద్యోతకమవుతుందని రామాయణం వివరిస్తుంది.

దీనిని బట్టి శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని శ్రేతాయుగమునందే చెప్పబడినట్లు తెలుస్తున్నది. స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్రనామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి, సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే ఈ మాసం రాగానే నూతన వధువులు మంగళ గౌరీ వ్రతమును ఐదు సంవత్సరాల పాటు నిర్వర్తిస్తారు.

పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. పూర్ణిమ నాడు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కట్టి వారితో సోదర ప్రేమను పంచుకొంటూ, ఈ ఆనందానికి సంకేతంగా వారి నుండి కానుకలు పొంది హృదయ పూర్వకంగా అనందిస్తారు. అనుబంధాలు పటిష్టం చేసుకుంటారు.

“గృహిణీ గృహముచ్యతే” అని చెప్పినందున, గృహిణులు అనందంగా ఉంటే ఆ గృహంలోని వారందరూ అనందంగానే ఉంటారు. శ్రావణం ఈ విధంగా

సంతోషాన్ని కలిగించేదవుతున్నది. ఈ మాసంలోనే బహుళ అష్టమి నాడు (శ్రీకృష్ణుడవతరించిన రోజు. కనుక కృష్ణాష్టమీ వ్రతాచరణం ఒక ముఖ్యమైన విషయంగా పరిగణించాలి. శ్రావణ పూర్ణిమ నాడు, బ్రహ్మచారులు గానీ, గృహస్థులు గానీ, శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ధారణ అనాదిగా ఆచారంగా వస్తున్నదని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

WhatsApp channel