Narmadashtakam: నర్మదానది పుష్కరాలలో పఠించవలసిన నర్మదాష్టకం.. ఇది పఠిస్తే పుష్కర పుణ్యం వస్తుంది
Narmadashtakam: నర్మదా నది పుష్కరాలలో పుష్కర స్నానం ఆచరించే సమయంలో నర్మదాష్టకం పఠించాలి. ఇలా చేయడం వల్ల పుష్కర పుణ్యం లభిస్తుందని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు.
Narmadashtakam: 1మే 2024 చిలకమర్తి పంచాంగరీత్యా ధ్భక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా దేవ గురువైనటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి సంచరించడం చేత నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చరక్రవర్తి శర్మ తెలిపారు.
నర్మదా నది పుష్కరాలలో పుష్కర స్నానం, దానం, జపం, తపం, పిండ ప్రధానాలు వంటివి ఆచరించాలని చిలకమర్తి తెలిపారు. నర్మదా నది పుష్కర స్నానం సంకల్ప సహితంగా ఆచరించి దేవతలకు, రుషులకు, సూర్య భగవానుడికి, నర్మదా నదికి తర్పణాలు వదిలి నర్మదాష్టకాన్ని పఠించినట్లయితే వారికి నర్మదా నది అనుగ్రహం చేత పుష్కర పుణ్య ఫలం లభిస్తుందని చిలకమర్తి తెలిపారు. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ప్రేక్షకుల కోసం నర్మదాష్టకాన్ని నర్మదా నది పుష్కరాల సందర్భంగా బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మగారు అందజేశారు.
నర్మదాష్టకం
సబిందుసింధుసుస్థలత్తరంగభంగరంజితం
ద్విషత్సు పాపజాతజాతకాదివారిసంయుతమ్|
కృతాంతదూతకాలభూతభీతిహారివర్శదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే||
త్వదంబులీనదీనమీనదివ్యసంప్రదాయకం
కలౌ మలౌఘభారహారిసర్వతీర్ధనాయకమ్|
సుమచ్చకచ్చన క్రచ క్రవాకచ క్రశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే||
మహాగభీరనీరపూరపాపధూతభూతలం
ధ్వనత్సమస్తపాతకారిదారితాపదాచలమ్|
జగల్లయే మహాభయే మృకండుసూనుహర్యదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే|||
గతం తదైవ మే భయం త్వదంబు వీక్షితం యదా
మృకండుసూనుశౌనకాసురారి సేవితం సదా|
పునర్భవాచ్ధిజన్మజం భవాచ్దిదుఃఖవర్శ్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే||
అలక్ష్యలక్షకిన్నరామరాసురాదిపూజితం
సులక్షనీరతీరధీరపక్షిలక్షకూజితమ్|
వసిష్టశిష్టపిప్పలాదికరమాదిశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే||
సనత్ముమారనాచికేతకశ్యపా త్రిషత్చదైః
ధృతం స్వకీయమానసేషు నారదాదిషత్ప్చదైః|
రవీందురంతిదేవదేవరాజకర్మశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే||
అలక్షలక్షలక్షపాపలక్షసారసాయుధం
తతస్తు జీవజంతుతంతుభుక్తిముక్తిదాయకమ్|
విరించివిషుశంకరస్వకీయధామవర్శదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే||
అహో ధృతం స్వనం శ్రుతం మహేశికేశజాతటే
కిరాతసూతబాడబేషు పండితే శఠే నటే|
దురంతపాపతాపహారి సర్వజంతుశర్మదే
త్వదీయపాదపంకజం నమామి దేవి నర్మదే||
ఇదం తు నర్మదాష్టకం త్రికాలమేవ యే సదా
పఠంతి తే నిరంతరం న యాంతి దుర్గతిం కదా|
సులభ్యదేహదుర్లభం మహేశధామగౌరవం
పునర్భవా నరానవై విలోకయంతి రౌరవమ్||