సెప్టెంబర్ మాస రాశి ఫలాలు.. వీరికి సవాలుతో కూడుకున్న నెల-monthly horoscope telugu september 2023 these zodiac signs are in for a challenging month ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Monthly Horoscope Telugu September 2023 These Zodiac Signs Are In For A Challenging Month

సెప్టెంబర్ మాస రాశి ఫలాలు.. వీరికి సవాలుతో కూడుకున్న నెల

HT Telugu Desk HT Telugu
Aug 31, 2023 04:28 PM IST

Monthly Horoscope: సెప్టెంబరు మాసంలో అనేక గ్రహాలు రాశిచక్రాలను మార్చబోతున్నాయి. ఆయా గ్రహాల కదలికల వల్ల ఈ మాసం 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.

సెప్టెంబరు 2023 మాస ఫలాలు
సెప్టెంబరు 2023 మాస ఫలాలు (pixabay)

సెప్టెంబర్ నెలలో చాలా పెద్ద గ్రహాలు తమ రాశిని మార్చుతాయి. ఈ గ్రహ సంచారం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఒక్కో రాశిపై ఒక్కో గ్రహ ప్రభావం ఉంటుంది.సెప్టెంబర్ నెలలో ఏయే రాశుల వారికి శుభ ఫలితాలు వస్తాయి? ఏయే రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి? ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

మేషరాశి

మేష రాశి వారికి సెప్టెంబర్ నెల డబ్బు పరంగా కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు కాబట్టి ఖర్చులకు దూరంగా ఉండండి. వ్యాపారులకు లాభం చేకూరుతుంది. ఈ కాలంలో మీరు తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఈ మాసంలో బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

వృషభరాశి

సెప్టెంబరు నెలలో వృషభ రాశి వారికి కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. ఈ సమయంలో మానసిక ఒత్తిడి కలవరపెడుతుంది. ఈ కాలం వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది. ఈ మాసంలో లాభాలు ఆర్జించడానికి ఏ నిర్ణయం తీసుకోకండి. న్యాయపరమైన విషయాల్లో కూడా తొందరపాటు తగదు. వృత్తి నిపుణులకు మాత్రం ఈ మాసం శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతి కూడా పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది..

మిథున రాశి

సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి ప్రేమ జీవితం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. వివాహితులకు ఈ మాసం ఎంతో శుభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడికి అనేక రెట్లు ప్రయోజనం పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న జాతకులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకుల్లో ఉద్యోగస్తులు ఈ కాలంలో సానుకూల ఫలితాలను పొందుతారు. వీరు పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరికి విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. ఈ మాసము వ్యాపారులకు లాభాలతో నిండి ఉంటుంది. మీరు ఏదైనా భాగస్వామ్య పనిలో నిమగ్నమై ఉంటే ఈ కాలం శుభప్రదంగా ఉంటుంది. నెలాఖరులో ధనలాభం పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది.

సింహరాశి

సింహ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కాస్త క్షీణిస్తుంది. ఈ కాలంలో మీరు ఖర్చులను తీర్చడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది. మీ భాగస్వామిని కలవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. మీ పరస్పర అవగాహన మెరుగ్గా ఉంటుంది. వివాహితులకు ఈ కాలం బాగుంటుంది. పదోన్నతి కోసం వేచి ఉంటే ఇంకాస్త ఓపిక ఉండాలి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

కన్య రాశి

కన్యరాశి వారు ఈ సమయంలో మాట్లాడేటపుడు సంయమనం పాటించాలి. లేదంటే మీరు విమర్శలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో ఒక గొప్ప అవకాశం మీ చేతి నుంచి జారిపోవచ్చు. మీ పురోగతి ఆగిపోవచ్చు. వ్యాపారులు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. డబ్బు లేకపోవడం వల్ల మీ కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు మధ్యలో ఆగిపోవచ్చు. మొత్తానికి ఈ మాసం మీకు సవాల్‌తో కూడుకున్నది.

తులారాశి

తులారాశి జాతకులలో వ్యాపారులకు ఈ సెప్టెంబర్ మాసం చాలా ముఖ్యమైనది. మీ కృషితో గొప్ప విజయాన్ని సాధిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు మంచి అవకాశం లభిస్తుంది. కొందరికి విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. డబ్బుకు సంబంధించిన వాగ్దానాలు చేయవద్దు. మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది.

వృశ్చికరాశి

ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది. వివాహితులకు ఈ మాసమంతా శుభదాయకంగా ఉండదు. చిన్న చిన్న విషయాలకు మీ మధ్య వాదోపవాదలు జరుగుతాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా ఈ మాసం మీకు బాగుంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆన్‌లైన్ వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి. ఈ కాలంలో మీరు ఎక్కువ పొదుపు చేయగలరు.

ధనుస్సు రాశి

ఉపాధి కోసం ఎదురు చూసే వారి నిరీక్షణ కాస్త ఎక్కువే అవుతుంది. అయితే నెలాఖరులో ఓ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఈ సమయం వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఎంతో ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో చక్కగా గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి.

మకరరాశి

సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. లేకపోతే మీకు సమస్యలు పెరుగుతాయి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి ఈ మాసం కష్టంగా ఉంటుంది. ఈ మాసం ప్రారంభం మీకు నెమ్మదిగా ఉంటుంది. ఒక గొప్ప అవకాశం మీ చేతుల్లోంచి జారిపోవచ్చు. భాగస్వామితో వివాదం తలెత్తవచ్చు. ఈ సమయంలో మీ పై అధికారి కోపం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

కుంభరాశి

కుంభ రాశి జాతకుల్లో వ్యాపారులకు ఈ మాసం చాలా ముఖ్యమైనది. మీరు ఆశించిన ఫలితాలను పొందకపోతే మీరు మీ ప్రణాళికను మార్చుకోవాలి. అయితే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పై అధికారులు సహోద్యోగులతో అనవసర ఘర్షణకు దూరంగా ఉండాలి. కుటుంబంలో కలహాలు సమసిపోతాయి. ఈ సమయంలో ఇంట్లో సామరస్యం నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది.

మీనరాశి

సెప్టెంబరు మాసము మీన రాశి వారికి ప్రేమ పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఈ సమయంలో కోపము, తొందరపాటుకు దూరంగా ఉండండి. ఈ మాసము పనిలో చాలా శుభప్రదంగా ఉండబోతోంది. వృత్తి నిపుణులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఏ పని అయినా ఈ కాలంలో పూర్తవుతోంది. మీ ఆర్థిక మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.

WhatsApp channel