Mokshada Ekadashi 2022 : మోక్షద ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు ఇవే..-mokshada ekadashi 2022 significance and history and puja vidhi and fasting rituals ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mokshada Ekadashi 2022 : మోక్షద ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు ఇవే..

Mokshada Ekadashi 2022 : మోక్షద ఏకాదశి పూజా విధానం, ఉపవాస నియమాలు ఇవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 03, 2022 07:15 AM IST

Mokshada Ekadashi 2022 : మోక్షద ఏకాదశికి జ్యోతిష్యంలో మంచి ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. దీనినే గీతా జయంతి అని కూడా అంటారు. ఇంతకీ దీని ప్రాముఖ్యత ఏమిటి? ఈ ఉపవాసం, పూజా నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మోక్షదా ఏకాదశి 2022
మోక్షదా ఏకాదశి 2022

Mokshada Ekadashi 2022 : మోక్షదా ఏకాదశి 2022 శుభ యోగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం మోక్షద ఏకాదశి డిసెంబర్ 3వ తేదీన వచ్చింది. అంటే ఈరోజే మోక్షదా ఏకాదశి అనమాట. మరి ఈరోజు ఏమి చేయాలి.. ఎలాంటి నియమాలు పాటించాలి.. ఈ రోజుకు ఎందుకు ఇంత ప్రాముఖ్యతనిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో.. ఏకాదశి ఉపవాసం అన్ని ఉపవాసాలలో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. అయితే మార్గశిర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని.. మోక్షద ఏకాదశి అంటారు. ఈరోజున ఉపవాసం చేస్తే.. ఆ ఫలితం జన్మ జన్మలకు ఉంటుందని చెప్తారు.

మహాభారత యుద్ధ సమయంలో.. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతను ఉపదేశించిన విషయం అందరికీ తెలిసింది. ఆ గీతను ఉపదేశించిన రోజే మార్గశిర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి. అందుకే దీనిని గీతా జయంతి అని కూడా అంటారు. అయితే ఈ మోక్షద ఏకాదశి రోజు చేసే ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మోక్షదా ఏకాదశి 2022 శుభ యోగం

మోక్షద ఏకాదశి రోజున రవియోగం కాకతాళీయంగా మారుతుంది. రవియోగంలో పనులు ప్రారంభించడం వల్ల సూర్యభగవానుడు, విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. రవి యోగం 3 డిసెంబర్ 2022, 07:04 AM నుంచి 4 డిసెంబర్ 2022, 06:16 AM వరకు కొనసాగుతుంది.

మోక్షదా ఏకాదశి ఉపవాసం, పూజ నియమాలు

* ఈరోజు ఉపవాసం చేస్తూ.. శ్రీకృష్ణుడిని పూజించండి.

* ఏకాదశికి ఒకరోజు ముందు.. దశమి తిథి నాడు మధ్యాహ్నం భోజనం చేయాలి.

* ఏకాదశి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి వ్రతాన్ని ఆచరించాలి.

* ఈ రోజున శ్రీకృష్ణుడిని పుష్పాలతో పూజించాలి.

* దీపాలను వెలిగించి.. శ్రీకృష్ణునికి ప్రసాదాన్ని సమర్పించండి.

* మీ సామర్థ్యానికి అనుగుణంగా పేదలకు ఆహారం ఇవ్వండి.

* మీ ఆరాధనలో శ్రీకృష్ణుడితో పాటు తులసిని కూడా పూజించండి. అదృష్టం కలిసి వస్తుంది.

మోక్షద ఏకాదశి జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యత

ఈ సంవత్సరం మోక్షద ఏకాదశి డిసెంబర్ 3వ తేదీ శనివారం వచ్చింది. ఇది మేషరాశిలో అశ్వినీ నక్షత్రంలో వస్తుంది. ఇక్కడ అశ్వినీ నక్షత్రం మేధస్సు గ్రహం అయిన కేతువుచే పాలించబడుతుంది. ఇది ఒక వ్యక్తికి మోక్షాన్ని ఇస్తుంది. ఇప్పుడు కేతువు అంగారకుడిచే పాలనలో వృశ్చికరాశిలో ఉన్నాడు. ప్రస్తుతం మేషం, వృశ్చికం రెండూ మార్స్ అనుగ్రహంతో ఉన్నాయి. ఇది ఆయా రాశులవారికి మంచిని చేస్తుంది.

మోక్షద ఏకాదశి నాడు ఈ పని చేయండి..

మోక్షదా ఏకాదశి నాడు.. ఉదయాన్నే స్నానం చేసి.. శ్రీ కృష్ణుని ముందు దీపం వెలిగించండి. అనంతరం గీతను చదవండి. ఇలా చేస్తే మీ మహా పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు. ఈ రోజున విష్ణుమూర్తికి ఐదు గురువింద గింజలను సమర్పించండి. పూజ తర్వాత.. వాటిని మీ సంపద స్థానంలో ఉంచండి. ఇది పురోగతికి మార్గం తెరుస్తుంది. అంతేకాకుండా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

WhatsApp channel

సంబంధిత కథనం