Mesha Rasi Today : మేష రాశి వారు ఈరోజు సహనంతో ఉంటే పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో తిరుగుండదు-mesha rasi daily horoscope august 20 2024 in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mesha Rasi Today : మేష రాశి వారు ఈరోజు సహనంతో ఉంటే పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో తిరుగుండదు

Mesha Rasi Today : మేష రాశి వారు ఈరోజు సహనంతో ఉంటే పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో తిరుగుండదు

Galeti Rajendra HT Telugu
Aug 20, 2024 05:58 AM IST

Aries Horoscope Today: పుట్టిన సమయంలో చంద్రుడు మేష రాశిలో సంచరిస్తున్న జాతకులను మేష రాశిగా పరిగణిస్తారు. ఈరోజు మేష రాశి వారి ప్రేమ, ఆర్థిక, ఆరోగ్యం, కెరీర్‌కి సంబంధించి జాతకం ఎలా ఉందంటే..

మేష రాశి
మేష రాశి

Aries Horoscope Today 20 August 2024: మేష రాశి వారు ఈరోజు ప్రేమ జీవితంలో భాగస్వామితో కాస్త తెలివిగా వ్యవహరించాలి. వ్యక్తిగత సవాళ్లు మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తాయి. ఆర్థికంగా కూడా బాగుంటారు. అయితే ఈ రోజు కాస్త వాదనలకు దూరంగా ఉండండి. ఆఫీసులో కొత్త సవాళ్లను తీసుకోవడానికి వెనుకాడొద్దు. అది మీ కెరీర్ ఎదుగుదలను ఇస్తుంది. ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.ఆరోగ్యం బాగుంటుంది.

yearly horoscope entry point

ప్రేమ

ఈ రోజు ప్రేమ వ్యవహారంలో తెలివిగా ఉండండి. మీ భాగస్వామి మద్దతు కూడా లభిస్తుంది. మీ భావోద్వేగాలను పంచుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోండి. ఈ రోజు కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు. కానీ అది మీ ప్రేమ జీవితాన్ని మాత్రం ప్రభావితం చేయదు. ఈ రోజు ప్రేమికులతో వాదనలకు దిగేటప్పుడు సహనం కోల్పోతారు. మాజీ లవర్‌తో తమ కష్టాలను ముగించుకోవాలనుకునే వారికి ఈ రోజు మంచి రోజు. కొంతమంది మహిళలకు వివాహం కోసం వారి తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది.

కెరీర్

మేష రాశి వారికి ఈరోజు వృత్తిపరమైన విజయం లభిస్తుంది. ఉద్యోగంలో సవాళ్లు ఉండవచ్చు. కానీ మీరు వాటిని అధిగమిస్తారు. ఈ రోజు కొత్త పనులు చేపట్టడానికి వెనుకాడరు. వృత్తిలో ఎదుగుదలను పొందుతారు. ఈ రోజు టీమ్ మీటింగ్‌లో క్రమశిక్షణతో ఉండి, మేనేజ్‌మెంట్ అంచనాల్ని అందుకోండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి సాయంత్రానికి కాల్ వస్తుంది.

ఆర్థిక

మేష రాశి వారికి ఈ రోజు డబ్బు అందుతుంది. రోజు ద్వితీయార్థంలో ఏ వాహనమైనా కొనుగోలు చేయడం మంచిది. ఈ రోజు మీరు కొంత డబ్బును స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వవచ్చు, ఎంత పెద్ద పెండింగ్ బకాయిలనైనా ఈరోజు ధైర్యంగా చెల్లించవచ్చు. రోజు ప్రథమార్ధంలో విరాళం ఇస్తారు.

ఆరోగ్యం

ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. కానీ కొంత మందికి శ్వాసకోశ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మందులు, మెడికల్ కిట్‌ను తీసుకెళ్లడం మర్చిపోవద్దు.

Whats_app_banner