Makara Rasi Today: మకర రాశి ఫలాలు 28 ఆగష్టు 2024: కొత్త ఒప్పందంపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త
Makara Rasi Today: ఇది రాశిచక్రం యొక్క 10 వ రాశి. పుట్టిన సమయంలో చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్న జాతకుల రాశిని మకర రాశిగా పరిగణిస్తారు.
మకర రాశి వారికి ఈ రోజు చిన్న ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. కానీ ఇది రోజువారీ జీవితంలో వారిపై ప్రభావం చూపదు. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. పనిలో అదనపు శ్రమ అవసరమయ్యే కొత్త పనుల కోసం చూడండి.
సంబంధిత ఫోటోలు
Feb 17, 2025, 12:25 PM43 రోజుల పాటు ఈ రాశులకు మెండుగా అదృష్టం.. ఆర్థికంగా, మానసికంగా ప్రయోజనాలు!
Feb 17, 2025, 09:40 AMVenus Transit: పూర్వాభాద్ర నక్షత్రంలో శుక్రుడు.. ఈ 3 రాశులకు అదృష్టం, కొత్త అవకాశాలు, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 17, 2025, 06:00 AMఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు! భారీగా ధన లాభం, అన్ని కష్టాలు దూరం..
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
Feb 15, 2025, 05:35 AMఇక విజయానికి కేరాఫ్ అడ్రెస్ ఈ 3 రాశులు- డబ్బులే, డబ్బులు..
ప్రేమ జీవితం
ప్రేమ సంబంధంలో విషయాలు కొంత ఊహించనివి ఎదురవ్వవచ్చు. అయితే త్యాగం చేసినప్పుడే నిజమైన ప్రేమ నిలుస్తుందని గుర్తుంచుకోవాలి. ఒకరితో ఒకరు ఉన్నప్పుడు, మీ గత మధుర క్షణాలను నెమరువేసుకోవడానికి ప్రయత్నించండి. రొమాంటిక్ సంభాషణలతో మీ ప్రేమికుడి మనోధైర్యాన్ని పెంచండి. పెళ్లయిన వారు తమ భాగస్వామికి పర్సనల్ స్పేస్ ఇవ్వాలి. వారు తమ నిర్ణయాలను తమ భాగస్వామిపై రుద్దకూడదు. అవివాహత మకర రాశి వారు ఈ రోజు కొత్త ప్రేమను కనుగొంటారు.
కెరీర్
ఈ రోజు మీకు లభించిన కొత్త పని కోసం అదనపు పనిగంటలను వెచ్చించాల్సి వస్తుంది. ఈ రోజు, అహానికి సంబంధించిన సమస్యల వల్ల ఉత్పాదకత దెబ్బతింటుంది. మీరు ఆఫీసుకు కొత్తవారైతే మీ అభిప్రాయాలు చెప్పకండి. పరీక్ష రాయబోయే విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు, కొత్త ప్రాజెక్టును ప్రారంభించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థిక వ్యవహారాలు
ఈ రోజు ధన పరంగా సమస్యలు ఎదురవుతాయి. కానీ ఇది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేయదు. ఈరోజు డబ్బు విషయంలో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్టాక్స్, బంగారంలో ఈ రోజు పెట్టుబడి పెడతారు. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోలుకు సాయంత్రం అనుకూలం. ఈరోజు వ్యాపారస్తులు ఫైనాన్స్ వ్యవహారాలు చక్కబెడతారు.
ఆరోగ్యం
ఈ రోజు మకర రాశి వారు ఆరోగ్య పరంగా మెరుగ్గా ఉంటారు. కొంతమంది మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. వారు దాని నుండి కోలుకుంటారు. రక్తపోటు ఉన్నవారు సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో కలిసి ఉండాలి. కొందరికి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. మరికొందరికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు చికిత్స అందుతుంది.