Love Marriage: శరీరంపై అక్కడ పుట్టుమచ్చ ఉంటే మీకు ప్రేమ వివాహం అయ్యే ఛాన్స్-this mole on the body revels about love marriage ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Love Marriage: శరీరంపై అక్కడ పుట్టుమచ్చ ఉంటే మీకు ప్రేమ వివాహం అయ్యే ఛాన్స్

Love Marriage: శరీరంపై అక్కడ పుట్టుమచ్చ ఉంటే మీకు ప్రేమ వివాహం అయ్యే ఛాన్స్

Peddinti Sravya HT Telugu
Dec 09, 2024 11:35 AM IST

Love Marriage: సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే, ప్రేమ పెళ్లి అవుతుందని చెప్పవచ్చు. మీ వివాహం ప్రేమ వివాహమా లేదంటే పెద్దలు కుదుర్చున వివాహమా అనేది తెలుసుకోవాలంటే, సాముద్రిక శాస్త్రం ప్రకారం ద్వారా తెలుసుకోవచ్చు.

శరీరంపై అక్కడ పుట్టుమచ్చ ఉంటే మీకు ప్రేమ వివాహం అయ్యే ఛాన్స్
శరీరంపై అక్కడ పుట్టుమచ్చ ఉంటే మీకు ప్రేమ వివాహం అయ్యే ఛాన్స్ (Pexels)

సాముద్రిక శాస్త్రం ప్రకారం మన ఒంటిపై ఉండే పుట్టుమచ్చల ఆధారంగా, మన జీవితానికి సంబంధించిన రహస్యాలని తెలుసుకోవచ్చు. సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉంటే, ప్రేమ పెళ్లి అవుతుందని చెప్పవచ్చు. చాలామంది ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మీ వివాహం ప్రేమ వివాహమా లేదంటే పెద్దలు కుదుర్చున వివాహమా అనేది తెలుసుకోవాలంటే, సాముద్రిక శాస్త్రం ప్రకారం ద్వారా తెలుసుకోవచ్చు.

yearly horoscope entry point

మీ గురించి సాముద్రిక శాస్త్రం ఏం చెప్తోంది?

పెళ్లి తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మార్పు వస్తుంది. పెళ్లి తర్వాత ఇద్దరు మనసులు మాత్రమే కాదు. రెండు కుటుంబాలు కలుస్తాయి. పెళ్లి తర్వాత జీవిత భాగస్వామిని అర్థం చేసుకుని, ఒకరినొకరు గౌరవించుకుంటూ మంచి కమ్యూనికేషన్ తో ముందుకు వెళ్తే ఇక జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. చాలా మంది ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, గౌరవించకపోవడం, అహంకారం వంటి కారణాల వలన విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. కానీ, పెళ్లి తర్వాత సరిగ్గా జీవిత భాగస్వామితో కలిసి వెళ్తే జీవితాంతం సంతోషంగా ఉండొచ్చు.

పెళ్లి గురించి సముద్రక శాస్త్రం ఏం చెప్తోంది?

కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో పుట్టుమచ్చలు ఉండడం వలన పెళ్లికి సంబంధించిన విషయాలు తెలుసుకోవచ్చు. ఈ ప్రదేశాల్లో పుట్టుమచ్చ ఉంటే, మీకు కచ్చితంగా ప్రేమ పెళ్లి అవుతుందని చెప్పవచ్చు.

కుడి కన్ను దగ్గర పుట్టుమచ్చ

కుడి కన్ను దగ్గర పుట్టుమచ్చ ఉన్నట్లయితే పురుషులు ఆకర్షితులవుతారు. ప్రేమ పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే అనుకున్న జీవిత భాగస్వామిని వీరు పొందుతారు. కుడి కన్ను దగ్గర పుట్టుమచ్చ ఉండే మహిళలకు కచ్చితంగా ప్రేమ పెళ్లి అవుతుంది.

చెవి దగ్గర పుట్టుమచ్చ

చెవి దగ్గర పుట్టుమచ్చ ఉండే మహిళల్లో ప్రేమ ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉండగలుగుతారు. ప్రేమను పంచగలుగుతారు. ఇటువంటి మహిళలకు కూడా ప్రేమ పెళ్లి అవుతుందని సాముద్రిక శాస్త్రం చెప్తోంది.

పెదవిపై పుట్టుమచ్చ

పెదాలపై పుట్టుమచ్చ ఉన్న మహిళ కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటుందని, సాముద్రిక శాస్త్రం చెప్తోంది. ఇలాంటి వాళ్లు ఇతరులను వారి నవ్వుతో ఆకర్షించగలుగుతారు. పైగా పెదవి పై పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిలు చాలా అందంగా కనపడతారు. ఇతరులని ఆకట్టుకోగలుగుతారు.

అరచేతి పై పుట్టుమచ్చ

అరచేతి పై పుట్టుమచ్చ ఉంటే కూడా మగవారిని ఆకర్షించగలుగుతారు. సులువుగా ఆకర్షించడం వలన ప్రేమలో పడతారు. ప్రేమ వివాహం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇలా సాముద్రిక శాస్త్రం ప్రకారం అరచేతిపై లేదా చేతిపై పుట్టుమచ్చ ఉండే మహిళలు కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది.

ముక్కుపై పుట్టుమచ్చ

మహిళలకు ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే, వారు ప్రేమ పెళ్లి చేసుకుంటారని.. ముక్కుకి కుడివైపు పుట్టుమచ్చ ఉండడం అదృష్టం అని తెలుస్తోంది. అలాగే మంచి జరగడానికి సంకేతం. ఇలాంటి వాళ్లు ప్రేమ పెళ్లి చేసుకుంటారు. పైగా అత్తమామల నుంచి వారికి మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. చాలా ఇష్టంగా ఆమెను చూసుకుంటారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం