Makar Sankranti 2023 : సంక్రాంతి ప్రాముఖ్యత ఇదే.. దీనిని ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఏమని పిలుస్తారంటే..-makar sankranti significance and names of sankranti in different states ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Makar Sankranti 2023 : సంక్రాంతి ప్రాముఖ్యత ఇదే.. దీనిని ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఏమని పిలుస్తారంటే..

Makar Sankranti 2023 : సంక్రాంతి ప్రాముఖ్యత ఇదే.. దీనిని ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో ఏమని పిలుస్తారంటే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 07, 2023 11:20 AM IST

Makar Sankranti 2023 : తెలుగు ప్రజలకు సంక్రాంతి అనేది ముఖ్యమైన పండుగలలో ఒకటి. పైగా ఇంగ్లీష్ క్యాలెండర్​లో వచ్చే మొట్టమొదటి పండుగ ఇది. ఈ సంక్రాంతి వసంత రుతువును ప్రారంభాన్ని సూచిస్తుంది. మరి ఈ సంవత్సరం సంక్రాంతి ఎప్పుడూ వస్తుంది.. దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర సంక్రాంతి
మకర సంక్రాంతి

Makar Sankranti 2023 : మకర సంక్రాంతి లేదా పొంగల్ అనేది ఋతువులతో ముడిపడి ఉన్న అనేక పండుగలలో ఒకటి. సంక్రాంతి అనేది భారతదేశంలో వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది పంట పండుగ. దీనిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. దానిలో మొదటి రోజును భోగి అని పిలుస్తారు. రెండవ రోజు సంక్రాతి సూర్య దేవుడైన సూర్యుడిని ఆరాధించడానికి అంకితం చేయబడింది. మూడో రోజు కనుమ.

ఈ మొత్తం పండుగ సీజన్‌లో మహిళలు ఇంటి ముఖద్వారాన్ని (వాకిలి లేదా ముందు వాకిలి) వివిధ రంగులు, రంగోలి (ముగ్గు లేదా కోలం)తో అలంకరిస్తారు. ఆవు పేడతో తయారు చేసిన చిన్న గొబ్బెమ్మలను తయారు చేస్తారు. దాని మధ్యలో పువ్వులతో అలంకరిస్తారు.

మకర సంక్రాంతి సూర్యుడు తన ఖగోళ మార్గంలో మకర రాశి (మకరం) లోకి మారడాన్ని సూచిస్తుంది. ఉత్తర అర్ధగోళం వైపు మారుతుంది అందుకే దీనిని ఉత్తరాయణం అంటారు. ఆ రోజు నుంచి ఆరు నెలల పాటు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సాంప్రదాయ భారతీయ క్యాలెండర్ చంద్ర స్థానాలపై ఆధారపడి ఉంటుంది. కానీ సంక్రాంతి అనేది సూర్యినిపై ఆధారపడి వస్తుంది. కాబట్టి అన్ని పండుగల తేదీలు మారుతూనే ఉంటాయి. మకర సంక్రాంతి మాత్రం ఆంగ్ల క్యాలెండర్ తేదీ ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉంటుంది. అదే జనవరి 14.

ఈ రోజుకు మరొక ప్రాముఖ్యత ఉంది. ఇది సంవత్సరంలో అతి తక్కువ రోజు, పొడవైన రాత్రి. ఈ రోజు తర్వాత రోజులు పొడవుగా & వెచ్చగా మారతాయి. తద్వారా చలికాలం తగ్గుతుంది. సంక్రాంతి దక్షిణ ఆసియా అంతటా కొన్ని ప్రాంతీయ వైవిధ్యాలతో జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను వివిధ పేర్లతో పిలుస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలతో ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు.

ఇతర రాష్ట్రాలలో సంక్రాంతిని ఎలా పిలుస్తారంటే..

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - సంక్రాంతి

* తమిళనాడు - పొంగల్

* గుజరాత్ - ఉత్తరాయణం

* హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ - మాఘి

* పంజాబ్ - లోహ్రీ

* అస్సాం - భోగాలీ బిహు

* కాశ్మీర్ - శిశుర్ సంక్రాత్

* ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్ - ఖిచ్డీ

* కర్ణాటక - మకర సంక్రమణం

ఇతర దేశాలలో కూడా ఈ రోజును వేర్వేరు పేర్లతో, వివిధ పద్ధతుల్లో జరుపుకుంటారు.

* నేపాల్: మాఘే సంక్రాంతి, మాఘి, మాఘే సంక్రాంతి, మాఘే సక్రతి

* థాయ్‌లాండ్: సాంగ్‌క్రాన్

* లావోస్: పై మా లావో

* మయన్మార్: థింగ్యాన్

* కంబోడియా: మోహ సంక్రాన్

* శ్రీలంక: పొంగల్, ఉజావర్ తిరునాల్

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్