లక్ష్మీ దేవి కటాక్షంతో ఈ ఐదు రాశుల వారికి డబ్బు కొరతే ఉండదు-goddess lakshmi devi will always bless these five zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Goddess Lakshmi Devi Will Always Bless These Five Zodiac Signs

లక్ష్మీ దేవి కటాక్షంతో ఈ ఐదు రాశుల వారికి డబ్బు కొరతే ఉండదు

Gunti Soundarya HT Telugu
Dec 08, 2023 07:00 AM IST

goddess lakshmi devi: లక్ష్మీదేవి ఎప్పుడు ఎవరి మీద కటాక్షం చూపిస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఈ ఐదు రాశుల వారికి మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.

లక్ష్మీదేవి
లక్ష్మీదేవి (Unsplash)

లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు సంతోషంగా సిరి సంపదలతో తులతూగుతుంది. కానీ లక్ష్మీదేవి స్థిరంగా ఒక చోట ఉండదని అంటారు. అమ్మవారి కటాక్షం పొందటం కోసం ఎన్నో రకాల పూజలు, వ్రతాలు చేస్తారు.

ట్రెండింగ్ వార్తలు

అందరూ కష్టపడేది డబ్బుకోసమే. ధనాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. లక్ష్మీదేవి తలుపు తడితే ఎవరు మాత్రం వద్దని అంటారు చెప్పండి. అందుకే అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజు ఉపవాసం ఉంది లక్ష్మీదేవిని పూజిస్తారు. అమ్మవారు కరుణిస్తే ఇంట్లో సంపద పెరుగుతుందని డబ్బుకి ఎటువంటి లోటు ఉండదని నమ్ముతారు. గ్రహాలు మారినప్పుడు 12 రాశుల వారికి ఏదో ఒక విధమైన ప్రభావం చూపుతాయి. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి కటాక్షం ఈ ఐదు రాశుల వారి మీద ఎప్పుడూ ఉంటుంది.

వృశ్చిక రాశి

ఈ రాశిలో జన్మించిన వారికి మొండితనం ఎక్కువ. ఇటువంటి స్వభావం కలిగిన వాళ్ళకి గొప్ప విజయం కలుగుతుంది. ఒక్కోసారి మొండితనం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. లక్ష్మీదేవిని అమితంగా ఇష్టపడతారు. ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఇటువంటి వారికి డబ్బు కొరత ఉండదు. కోపాన్ని అధిగమిస్తూ విజయం వైపు అడుగులు వేస్తే వీరికి డబ్బుకు లోటే ఉండదు. ఎప్పుడూ లక్ష్మీదేవి కటాక్షం ఈ రాశి వారి మీద ఉంటుంది. వ్యాపార రంగంలో దూసుకెళ్తారు. ఆర్థిక సమస్యలు ఉండవు.

కర్కాటక రాశి

ఈ రాశి కింద పుట్టిన వాళ్ళు బాగా కష్టపడే గుణం కలిగినవారు. కష్టపడి పని చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. ఈ రాశి వారిపై లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు లభిస్తాయి. మంచి మనసుతో ఏ పని తలపెట్టిన ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఎప్పుడూ ధన లాభం కలుగుతూనే ఉంటుంది. సుఖ సంతోషాలతో నిండైన జీవితం గడుపుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు.

వృషభ రాశి

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందుతారు. అదృష్టం వారి వెంటే ఉంటుంది. చాలా అరుదుగా పేదరికాన్ని అనుభవిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు అదృష్ట వంతులు. వీరిది శుక్ర గ్రహం. ఆనందం, సంపద, సుఖ సంతోషాలకు శుక్ర గ్రహం నిలయంగా ఉంటుంది. ఒక రకంగా వీళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బు కొరత అనేది ఎప్పుడూ ఉండదు.

సింహ రాశి

ఈ రాశి వ్యక్తులు లక్ష్మీదేవి ఆశీర్వాదాలని ఆకర్షించమే కాకుండా సూర్య భగవానుడి దయ కూడా పొందుతారు. సింహ రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితకాలం సుఖాలని అనుభవిస్తారు. డబ్బు లేని లోటు అనేది తెలియకుండా పెరుగుతారు. కష్టపడి విజయాలు సాధిస్తారు. ఈ రాశి వారికి కాస్త కోపం ఎక్కువ. అది అదుపులో ఉంచుకుంటే అదృష్టం వెన్నంటే ఉంటుంది. కోపం తగ్గించుకోకపోతే వారి ప్రయత్నాలు దెబ్బతింటాయి.

తులా రాశి

తుల రాశి వ్యక్తులు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉంటారు. తులా రాశిని పాలించే గ్రహం శుక్రుడు. లక్ష్మీదేవికి సంబంధించినది. ఈ రాశి వారికి ప్రేమా గుణం ఎక్కువ. ఆర్థిక జీవితం బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఎప్పుడు ఆర్థిక వనరుల కొరతని ఎదుర్కోరు.

WhatsApp channel

2024 సంవత్సర రాశి ఫలాలు

నూతన సంవత్సర రాశి ఫలాలు, పండగలు, శుభాకాంక్షలు ఇంకా మరెన్నో ఇక్కడ చదవండి.