Bhagavadgita shlokalu: బాధలతో కుంగిపోతున్నారా? ఈ శ్లోకాలు పఠించారంటే మనసుకు ఊరట లభిస్తుంది-chanting these ten bhagavad gita shlokas to solve life problems ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Bhagavadgita Shlokalu: బాధలతో కుంగిపోతున్నారా? ఈ శ్లోకాలు పఠించారంటే మనసుకు ఊరట లభిస్తుంది

Bhagavadgita shlokalu: బాధలతో కుంగిపోతున్నారా? ఈ శ్లోకాలు పఠించారంటే మనసుకు ఊరట లభిస్తుంది

Gunti Soundarya HT Telugu
Jul 10, 2024 11:24 AM IST

Bhagavadgita shlokalu: భరించలేని కష్టాలు వచ్చినప్పుడు, సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాటిని చూసి కుంగిపోతారు. అటువంటి సమయంలో ధైర్యాన్ని ఇచ్చే ఈ శ్లోకాలు పఠించడం వల్ల మనసుకు ఊరట లభిస్తుంది.

బాధలు కష్టాల నుంచి బయటపడేసే శ్లోకాలు
బాధలు కష్టాల నుంచి బయటపడేసే శ్లోకాలు (pixabay)

Bhagavadgita shlokalu: మనిషి ఎలా జీవించాలి అనేది భగవద్గీత బోధిస్తుందని చెబుతారు. అనేక జీవిత సమస్యలను పరిష్కరించేందుకు గీతాబోధనలు చక్కగా ఉపయోగపడతాయి. జీవితంలోనే సవాళ్లను ఎదుర్కొనేందుకు సహాయపడే పది శక్తివంతమైన శ్లోకాలు ఇవి. భగవద్గీతలోనే ఈ శక్తివంతమైన శ్లోకాలు నిత్యం పారాయణం చేయడం వల్ల మీ జీవితంలోని సవాళ్లు ఎదుర్కొనే ధైర్యం మీకు లభిస్తుంది.

కర్మాణ్యేవాధీకారస్తే మా ఫలేషు కదాచన |

మా కర్మఫలహేతుర్భూర్మాతే సజ్గోయస్త్వకర్మణి ||

ఈ శ్లోకం ఫలితాలతో సంబంధం లేకుండా మీ విధులను మీరు నిర్వర్తించడం గురించన ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి. ఫలితాల గురించి చింతించకూడదని బోధిస్తుంది. దీనివల్ల ఒత్తిడి ఆందోళన లేకుండా జీవించగలరు.

వాసాంపి జీర్ణాణి యథా విహాయ, నవాని గృహాతి నరోత్పరాణి |

తథా శరీరి విహాయ జీర్ణ న్యాన్యాని సంయాతి నవాని దేహి ||

ఈ శ్లోకం ఆత్మ శాశ్వతమైన స్వభావాన్ని తెలియజేస్తుంది. దీని అర్థం చేసుకోవడం వల్ల మరణభయం అనేది ఉండదు. ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు మనసు స్థిమితంగా ఉండదు. అటువంటి సమయంలో ఈ శ్లోకం పఠించడం వల్ల శాంతి లభిస్తుంది. ఏదైనా దేవుడి చిత్తానుసారమే జరుగుతుందనే భావాన్ని ఈ శ్లోకం వివరిస్తుంది.

పత్రం పుష్పం ఫలం తోయం, యో మే భక్త్వాప్రయచ్ఛతి |

తదాహం భక్త్యుపహ్భతమష్నాంఈ, ప్రయతాత్మనః ||

ఈ శ్లోకం భక్తి, చిత్తశుద్ధి ప్రాముఖ్యతను చెబుతుంది. చిత్తశుద్ధితో తలపెట్టిన ఏ కార్యమైన, మంచి ఉద్దేశమైన అది విజయాన్ని ఇస్తుంది. అదే దురుద్దేశంతో మొదలెట్టిన ఏ పని అయినా అది అసంపూర్తిగా నిలిచిపోతుందనేది దీని భావం.

దుఃఖేష్వణుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ |

వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే ||

ఈ శ్లోకం మనకు సంతోషం, దుఃఖం రెండింటిని సమానంగా తీసుకోవాలని సూచిస్తుంది. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉండడానికి అలవాటు పడుతుంది. వ్యక్తిగత మెరుగుదల మానసిక స్థిరత్వానికి దోహదపడుతుంది. భయం, క్రోధం లేని వాడు స్థిరమైన జ్ఞానిగా మారతాడు.

శ్రేయాన్స్వధర్మొ విగుణః పరధర్మత్స్వనుష్ఠితాత్ |

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

ఈ శ్లోకం అసంపూర్తిగా వదిలేసిన విధులను సక్రమంగా అమలు చేయడానికి సూచిస్తుంది. ఇతరులను చూసి వాళ్ళలా ఉండాలని అనుకోవడం మంచిది కాదు. ఎదుటివారిని చూసి అసూయ పడకుండా మనం నిజాయితీగా ఉండాలని ఈ శ్లోకం తెలియజేస్తుంది.

ఉద్ధరేదాత్మనాత్నానం నాత్మానమపసాదయేత్ |

ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః ||

ఈ శ్లోకం స్వీయ క్రమ శిక్షణను ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా నియంత్రిస్తాము, మన జ్ఞానం ఎంతవరకే ఉన్నది అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది.

సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యాంఈ మా శుచః ||

ఈ శ్లోకం దైవం ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఉన్నతమైన శక్తిని విశ్వసించాలని మనకు బోధిస్తుంది. భయాలను చింతలను వీడాలని చెబుతుంది. మనస్పూర్తిగా దైవాన్ని ప్రార్థించి పాపాలను ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడని ఈ శ్లోకం చెబుతోంది.

యోగస్థః కురు కర్మాణి సంజ్ఞ త్యక్త్వా ధనంజయ |

సిద్ధసిద్ద్యోః సమో భూత్వా సమత్వం యోగా ఉచ్యతే ||

ఈ శ్లోకం ఫలితాలతో సంబంధం లేకుండా మంచి మనసుతో విధులను నిర్వర్తించే భావనను బలపరుస్తుంది. విజయం, అపజయం రెండింటినీ సమానంగా స్వీకరించాలని ఇది బోధిస్తుంది.

త్రైగుణ్యవిషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున్ |

నిర్ధ్వాన్ద్వో నిత్యసత్త్వస్థో నిరోగ్యక్షీం ఆత్మవాన్ ||

ఈ శ్లోకం భౌతిక విషయాలు, ఆందోళనలను అధికమించి ఆధ్యాత్మికత మీద దృష్టి సారించాలని సూచిస్తుంది. వైరాగ్యం అన్నిటికీ పరిష్కారం కాదనే విషయాన్ని తెలియజేస్తుంది.

యదాతే మోహకబిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |

తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతు స్య చ ||

ఈ శ్లోకం నిజమైన జ్ఞానాన్ని పొందడం ద్వారా అజ్ఞానం అనే మాయలో అధిగమించే దానికి సహాయపడుతుందని తెలియజేస్తుంది. వివేకం, స్పష్టత కోసం మనల్ని ప్రోత్సహిస్తుంది.

భగవద్గీతలోనే ఈ చిన్న చిన్న శ్లోకాలు పఠించడం వల్ల సమస్యలకు భయపడకుండా వాటికి ఎదురు వెళ్లగలుగుతారు. జీవితం అంటే ఏంటో తెలుసుకోగలుగుతారు. ఇవి మనకు అనేక సమస్యలకు పరిష్కారాలను చూపిస్తాయి. జీవితానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి. శాంతియుతమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడిపేందుకు సహాయపడతాయి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner