Lord hanuman: మేషం, సింహం సహా ఈ రాశులకు హనుమంతుడి దయతో సంపద లభిస్తుంది-aries and leo zodiac signs are lord hanuman favorite ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Hanuman: మేషం, సింహం సహా ఈ రాశులకు హనుమంతుడి దయతో సంపద లభిస్తుంది

Lord hanuman: మేషం, సింహం సహా ఈ రాశులకు హనుమంతుడి దయతో సంపద లభిస్తుంది

Gunti Soundarya HT Telugu
Jul 04, 2024 08:12 AM IST

Lord hanuman: హనుమంతుడి దయ ఉంటే దేనికి భయపడరు. అటువంటి హనుమంతుడికి ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

హనుమంతుడి అనుగ్రహం పొందిన రాశులు ఇవే
హనుమంతుడి అనుగ్రహం పొందిన రాశులు ఇవే

Lord hanuman: హనుమంతుడిని ఆరాధించడం ద్వారా వ్యక్తి శక్తి, తెలివి, జ్ఞానం అనుగ్రహాన్ని పొందుతాడు. హనుమంతుడిని ఆరాధించడానికి మంగళవారం ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. హిందూ మతంలో హనుమాన్ ని శివుని రూపంగా వర్ణించారు.

పవన పుత్రుడు హనుమంతుడి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో సంక్షోభాలు ఎదురుకావని అంటారు. హనుమంతుడిని ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. మంగళవారం హనుమంతుడిని పూజించడం వల్ల ఆపద లేదా ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు. కొన్ని రాశుల వారికి హనుమంతుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. 

హనుమంతుడిని పూజించే వారిపై శని ప్రభావం కూడా తగ్గుతుందని చెబుతారు. జ్యోతిష్య శాస్త్రంలో హనుమంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండే రాశుల గురించి ప్రస్తావించారు. మీరు కూడా ఆ అదృష్ట రాశి అవునో కాదో చూసేయండి. 

వృశ్చిక రాశి

వృశ్చికం హనుమంతునికి ఇష్టమైన రాశిగా పరిగణిస్తారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. హనుమంతునికి ఈ రాశి చాలా ప్రీతిపాత్రంగా ఉండడానికి ఇది కూడా ఒక కారణం. హనుమంతుని అనుగ్రహంతో ఈ రాశికి చెందిన వారు జీవితంలో చాలా పేరు, కీర్తిని పొందుతారు. హనుమంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ రాశి వారు ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వాళ్ళు హనుమంతుడి దయతో ప్రతి కష్టాన్ని ఓర్పుతో ఎదుర్కొంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడరు. వీరికి బజరంగ బలి ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి.  

మేష రాశి

హనుమంతుడికి మేష రాశి అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారికి హనుమంతుని ఆశీస్సులు అలాగే ఉంటాయి. అదే సమయంలో ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ కారణంగా కూడా ఈ రాశిచక్రం హనుమాన్ కి ఇష్టమైన రాశిచక్ర గుర్తులలో చేర్చబడింది. మంగళవారం నాడు హనుమంతుడిని ధ్యానించడం ద్వారా ఈ రాశి వారికి అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ రాశి వాళ్ళు ఆంజనేయుడికి పరమ భక్తులు. కుజుడు పాలనాధిపతిగా ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళు ధైర్యవంతులు, స్వావలంబన, నిర్భయంగా ఉంటారు. బజరంగ బలి ఆశీర్వాదంతో ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. 

సింహ రాశి

హనుమంతుడికి ఇష్టమైన రాశిలో సింహ రాశి మరొకటి. ఈ రాశికి అధిపతి సూర్యుడు.  ఈ రాశి వారికి హనుమంతుని ఆశీస్సులు ఉంటాయి. అందువల్ల సింహ రాశి వారు ప్రతిరోజూ హనుమంతుడిని పూజించడం ద్వారా వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సును పొందగలరు.

కుంభ రాశి

హనుమంతునికి ఇష్టమైన రాశిచక్రాలలో కుంభ రాశి కూడా ఒకటి. ఈ రాశి వారికి హనుమంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కావున జీవితంలోని దుఃఖాలు, కష్టాలు తొలగిపోవాలంటే హనుమంతుడిని సక్రమంగా పూజించాలి. 

మకర రాశి 

మకర రాశి జాతకులు హనుమంతుడికి నిజమైన భక్తులుగా భావిస్తారు. ఈ రాశిని పాలించే గ్రహం శని. హనుమంతుడిని ఆరాధించడం వల్ల శని దేవుడి అనుగ్రహం కూడా పొందుతారు. దేవుళ్ళలో శని పట్టని వ్యక్తిగా హనుమంతుడని చెప్తారు. 

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

 

WhatsApp channel