తెలుగు న్యూస్ / ఫోటో /
శొంఠితో విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఆయుర్వేదం ఏం చెబుతుందో తెలుసుకోండి!
- శొంఠితో దగ్గు, జలుబు లాంటివి దూరం అవుతాయి. అంతేకాకుండా సీజనల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇవేకాకుండా ఆయుర్వేదం ప్రకారం సొంటితో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అవేంటో చూడండి.
- శొంఠితో దగ్గు, జలుబు లాంటివి దూరం అవుతాయి. అంతేకాకుండా సీజనల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇవేకాకుండా ఆయుర్వేదం ప్రకారం సొంటితో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అవేంటో చూడండి.
(1 / 6)
Dry Ginger: శొంఠిని సొంటి లేదా ఎండబెట్టిన అల్లం అని కూడా పిలుస్తారు. దగ్గు, జలుబుకు సంబంధించి ఆయుర్వేదంలో ఇదే దివ్యౌషధము. తాజా అల్లం కంటే సొంటి తేలికగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. సొంటి పొడిని నీటితో కలిపి తీసుకుంటే మేలైన ప్రయోజనాలుంటాయి. ఒక లీటర్ నీటిలో అర టీస్పూన్ సొంటి పొడిని కలిపి, ఆపై కొద్దిగా వేడిచేసుకొని తాగాలి..(Shutterstock)
(2 / 6)
Relieves constipation: చలికాలంలో చాలా మందికి మలబద్ధకం సమస్య వేధిస్తుంది. ఉదయం ఎవరికైనా కడుపుపట్టేసినట్లు కష్టంగా అనిపిస్తే, వారు ఒక గ్లాసు నీటిలో కొద్దిగా సొంటిపొడి వేసుకొని త్రాగితే సత్వర పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ రేఖా రాధామోని పేర్కొన్నారు.(Shutterstock)
(3 / 6)
Reduces mucus: నాసికంలో కఫము, గొంతులో తెమడ ఎక్కువైనపుడు చాలా మంది అల్లం తీసుకుంటారు. కానీ అల్లం సమస్యను మరింత ముదిరేలా చేస్తుంది. బదులుగా సొంటి తీసుకోవాలి. దగ్గు, జలుబు, ఫ్లూ లేదా ఎలాంటి శ్వాస సంబంధమైన ఇబ్బందులు తలెత్తినపుడు అల్లంకు బదులు సొంటి ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.(Shutterstock)
(4 / 6)
Good for digestion: ప్రతిరోజూ ఉదయం సొంటి నీరు తాగడం ద్వారా తినే ఆహరం తేలికగా జీర్ణమవుతుంది. ఎలాంటి ఉబ్బసం, కడుపు మంట లాంటి సమస్యలు తలెత్తవు.(Pixabay)
(5 / 6)
Helps in weight loss: సొంటి ఒకవైపు జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది, మరోవైపు ఆకలిని మందగిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.(Shuttestock)
ఇతర గ్యాలరీలు