ICC T20I Rankings: ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్.. గిల్ కూడా పైకి.. బౌలింగ్‍లో టాప్-10లోకి బిష్ణోయ్-yashasvi jaiswal and shubman gill gained in icc t20i rankings ravi bishnoi in top 10 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Icc T20i Rankings: ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్.. గిల్ కూడా పైకి.. బౌలింగ్‍లో టాప్-10లోకి బిష్ణోయ్

ICC T20I Rankings: ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్.. గిల్ కూడా పైకి.. బౌలింగ్‍లో టాప్-10లోకి బిష్ణోయ్

Jul 31, 2024, 06:59 PM IST Chatakonda Krishna Prakash
Jul 31, 2024, 06:54 PM , IST

  • ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్‍ల్లో భారత బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. జైస్వాల్ టాప్-5లోకి అడుగుపెట్టాడు.

ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‍లో రాణించిన భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్‍ల్లో దూసుకొచ్చాడు. నేడు ప్రకటించిన తాజా ర్యాంకింగ్‍ల్లో రెండు స్థానాలను మెరుగుపరుచుకొని టీ20 బ్యాటర్ల లిస్టులో నాలుగో ర్యాంకుకు చేరాడు. టాప్-5లోకి దూసుకొచ్చాడు జైస్వాల్. 

(1 / 5)

ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‍లో రాణించిన భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్‍ల్లో దూసుకొచ్చాడు. నేడు ప్రకటించిన తాజా ర్యాంకింగ్‍ల్లో రెండు స్థానాలను మెరుగుపరుచుకొని టీ20 బ్యాటర్ల లిస్టులో నాలుగో ర్యాంకుకు చేరాడు. టాప్-5లోకి దూసుకొచ్చాడు జైస్వాల్. (AFP)

శ్రీలంకను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఈ సిరీస్‍లో యశస్వి  178  స్ట్రైక్‍రేట్‍తో 80 పరుగులు చేశాడు. అంతకు ముందు జింబాబ్వేతో సిరీస్‍లో అదరగొట్టాడు. దీంతో టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో ఆరు నుంచి నాలుగో ర్యాంకుకు యశస్వి జైస్వాల్ ఎగబాకాడు. 

(2 / 5)

శ్రీలంకను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఈ సిరీస్‍లో యశస్వి  178  స్ట్రైక్‍రేట్‍తో 80 పరుగులు చేశాడు. అంతకు ముందు జింబాబ్వేతో సిరీస్‍లో అదరగొట్టాడు. దీంతో టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో ఆరు నుంచి నాలుగో ర్యాంకుకు యశస్వి జైస్వాల్ ఎగబాకాడు. (PTI)

భారత యంగ్ స్టార్ శుభ్‍మన్ గిల్ 16 స్థానాలు పైకి ఎగబాకి.. తన కెరీర్ బెస్ట్ 21వ ర్యాంకుకు చేరాడు. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్‍ల్లో రెండో స్థానంలో కొనసాగాడు భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్. తొలి ర్యాంకులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు. 

(3 / 5)

భారత యంగ్ స్టార్ శుభ్‍మన్ గిల్ 16 స్థానాలు పైకి ఎగబాకి.. తన కెరీర్ బెస్ట్ 21వ ర్యాంకుకు చేరాడు. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్‍ల్లో రెండో స్థానంలో కొనసాగాడు భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్. తొలి ర్యాంకులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు. (AFP)

ప్రస్తుతం ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్‍ల్లో ట్రావిస్ హెడ్ (844 రేటింగ్ పాయింట్లు), సూర్యకుమార్ యాదవ్ (805), ఫిల్ సాల్ట్ (797), యశస్వి జైస్వాల్ (757), బాబర్ ఆజమ్ (755) ఉన్నారు. భారత యువ స్టార్ రుతురాజ్ గైక్వాడ్ (664) ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. 

(4 / 5)

ప్రస్తుతం ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్‍ల్లో ట్రావిస్ హెడ్ (844 రేటింగ్ పాయింట్లు), సూర్యకుమార్ యాదవ్ (805), ఫిల్ సాల్ట్ (797), యశస్వి జైస్వాల్ (757), బాబర్ ఆజమ్ (755) ఉన్నారు. భారత యువ స్టార్ రుతురాజ్ గైక్వాడ్ (664) ఎనిమిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. (HT_PRINT)

ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్‍ల్లో భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ మళ్లీ టాప్-10లో అడుగుపెట్టాడు. శ్రీలంకతో సిరీస్‍లో దుమ్మురేపిన బిష్ణోయ్ తాజా ర్యాంకింగ్‍ల్లో 8 స్థానాలు ఎగబాకి పదో ర్యాంకుకు వచ్చేశాడు. భారత్ నుంచి టీ20 టాప్ ర్యాంక్ బౌలర్‌గా పస్తుతం ఉన్నాడు. టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్‍లో ఉన్నాడు.

(5 / 5)

ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్‍ల్లో భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్ మళ్లీ టాప్-10లో అడుగుపెట్టాడు. శ్రీలంకతో సిరీస్‍లో దుమ్మురేపిన బిష్ణోయ్ తాజా ర్యాంకింగ్‍ల్లో 8 స్థానాలు ఎగబాకి పదో ర్యాంకుకు వచ్చేశాడు. భారత్ నుంచి టీ20 టాప్ ర్యాంక్ బౌలర్‌గా పస్తుతం ఉన్నాడు. టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ టాప్‍లో ఉన్నాడు.(Jay Shah - X)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు