తెలుగు న్యూస్ / ఫోటో /
Women's T20 World Cup 2024: పాపం సౌతాఫ్రికా.. వరల్డ్ కప్ కల కలగానే.. 20 నెలల్లో మూడు ఫైనల్స్‌లో ఓటమి
- Women's T20 World Cup 2024: సౌతాఫ్రికా టీమ్ వరల్డ్ కప్ కల కలగానే మిగిలిపోయింది. గత 20 నెలల కాలంలో అటు పురుషులు, ఇటు మహిళలు కలిపి మూడుసార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ చేరినా.. అన్నిసార్లూ ఓటమి తప్పలేదు. తాజాగా న్యూజిలాండ్ వుమెన్స టీమ్ చేతుల్లోనే సౌతాఫ్రికా ఫైనల్లో ఓడిపోయింది.
- Women's T20 World Cup 2024: సౌతాఫ్రికా టీమ్ వరల్డ్ కప్ కల కలగానే మిగిలిపోయింది. గత 20 నెలల కాలంలో అటు పురుషులు, ఇటు మహిళలు కలిపి మూడుసార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ చేరినా.. అన్నిసార్లూ ఓటమి తప్పలేదు. తాజాగా న్యూజిలాండ్ వుమెన్స టీమ్ చేతుల్లోనే సౌతాఫ్రికా ఫైనల్లో ఓడిపోయింది.
(1 / 5)
Women's T20 World Cup 2024: వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో వరుసగా రెండోసారీ సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. ఈసారి సెమీఫైనల్లో ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరడంతో వాళ్ల వరల్డ్ కప్ కల నెలవేరుతుందని అందరూ భావించారు. కానీ ఆదివారం (అక్టోబర్ 20) జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి తప్పలేదు.
(2 / 5)
Women's T20 World Cup 2024: గత 20 నెలల్లో అటు పురుషుల టీమ్, ఇటు మహిళల టీమ్ టీ20 వరల్డ్ కప్ లలో మూడుసార్లు ఫైనల్ చేరింది. అన్నింట్లోనూ ఆ టీమ్ ఓడిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆ టీమ్ కప్పు గెలవలేకపోయింది. ఇక ఈ ఏడాది జూన్ లో పురుషుల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా చేతుల్లో సౌతాఫ్రికా ఓడిన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్ మహిళల టీమ్ చేతుల్లో సౌతాఫ్రికా మహిళల టీమ్ ఫైనల్లో ఓడింది.
(3 / 5)
Women's T20 World Cup 2024: గతేడాది సౌతాఫ్రికాలోనే వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ జరిగింది. ఈ మెగా టోర్నీలో ఆ టీమ్ తొలిసారి ఫైనల్ చేరింది. అయితే ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి తప్పలేదు. ఈసారి వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకొని ఫైనల్లో అడుగుపెట్టిన సౌతాఫ్రికా టీమ్.. అక్కడ న్యూజిలాండ్ చేతుల్లో దారుణంగా ఓడిపోయింది.
(4 / 5)
Women's T20 World Cup 2024: ఈ ఏడాది జూన్ 29న మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. ఇండియాతో సౌతాఫ్రికా తలపడింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 176 రన్స్ చేసింది. తర్వాత సౌతాఫ్రికా 169 రన్స్ మాత్రమే చేయగలిగింది. మెన్స్ క్రికెట్ లో ఓ వరల్డ్ కప్ ఫైనల్ చేరడం సౌతాఫ్రికాకు ఇదే మొదటిసారి. కానీ కప్పు మాత్రం అందుకోలేకపోయింది.
ఇతర గ్యాలరీలు