(1 / 7)
హెల్త్ ఇన్సూరెన్స్ మహిళలకు కూడా చాలా ముఖ్యం. అయితే, మహిళలు ఆరోగ్య బీమా తీసుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి.
(MINT_PRINT)(2 / 7)
స్త్రీలకు 30 ఏళ్లు వచ్చేసరికి శారీరక సమస్యలు మొదలవుతాయి. అందువల్ల ఆ లోపే మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం మంచిది. దానివల్ల చెల్లించాల్సిన ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది.
(3 / 7)
40 ఏళ్లు దాటిన స్త్రీలకు రొమ్ము క్యాన్సర్, జననేంద్రియ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఎముక సంబంధిత వ్యాధులు, రక్తపోటు మొదలైన సమస్యలు ప్రారంభమయ్యే ముప్పు ఉంది.
(4 / 7)
చాలా బీమా కంపెనీలు తమ ఆరోగ్య బీమా పథకాలలో ఇటువంటి స్త్రీ జననేంద్రియ వ్యాధులను కవర్ చేయవు. కాబట్టి, ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు పైన పేర్కొన్న వ్యాధులు ప్లాన్ కింద కవర్ చేయబడిందా లేదా అని విచారించడం మంచిది.
(5 / 7)
గర్భం దాల్చిన తరువాత ప్రసూతి అనేది మహిళలకు పునర్జన్మ వంటిది ఆ సమయంలో అనేక. వైద్య ఖర్చులు ఉంటాయి. నేటి కాలంలో, ప్రసవ ఖర్చు చాలా రెట్లు పెరిగింది. కాబట్టి మీరు ఎంచుకున్న ఆరోగ్య బీమా పథకం ప్రసూతి ఖర్చులను కవర్ చేస్తుందా? అని గమనించాలి.
(6 / 7)
బిడ్డ పుట్టిన వెంటనే టీకాలు వేయడం నుంచి కొత్త ఆరోగ్య ఖర్చులు ప్రారంభమవుతాయి. నవజాత శిశువుకు అవసరమైన ఖర్చులను కవర్ చేసే ప్రసూతి బీమా పథకం అదనపు ప్రత్యేకత.
(7 / 7)
మీ వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మీకు సరిపోయే బీమా పథకాన్ని ఎంచుకోండి.
ఇతర గ్యాలరీలు