Chandra Grahanam 2024: సెప్టెంబర్లో చంద్రగ్రహణం ఎప్పుడుంది? అది మనకు కనిపిస్తుందా?
Chandra Grahanam 2024: ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్లో వస్తోంది. ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? ఆరోజు ఎలా పూజ చేయాలి? వంటి వివరాలు తెలుసుకోండి.
(1 / 5)
2024లో సెప్టెంబర్లో రెండో చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణం అంటే చంద్రునికి, సూర్యుడికి మధ్యకు భూమి వచ్చినప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది.
(2 / 5)
ఈ ఏడాది చంద్రగ్రహణం సెప్టెంబర్ 18న వస్తుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6.11 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. ఆ రోజు ఉదయం 10:17 గంటలకు గ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం వ్యవధి 4 గంటల 6 నిమిషాలు ఉంటుంది. (AFP)
(3 / 5)
ఈ చంద్రగ్రహణం యూరోప్ దేశాల్లో, ఆసియా, ఆఫ్రికా, ఉత్తరమెరికా, దక్షిణమెరికా దేశాల్లో కనిపిస్తుంది. మనదేశంలో మాత్రం కనిపించే అవకాశం లేదు.
(4 / 5)
చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు భూమిపై నుంచి చూస్తే చంద్రగ్రహణంగానే కనిపిస్తుంది. అదే చంద్రుడి నుంచి చూస్తే అది సూర్యగ్రహణంగా కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రగ్రహణం రోజు భూమిపై నుంచి చూస్తే చంద్రుడు కనిపించడు. అదే చంద్రగ్రహణం రోజు చంద్రుడి పైనుంచి చూస్తూ సూర్యుడు కనిపించడు.
ఇతర గ్యాలరీలు