తెలుగు న్యూస్ / ఫోటో /
Volkswagen Tiguan Exclusive Edition: ఆకర్షణీయమైన మార్పులతో ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ప్రత్యేక ఎడిషన్: వివరాలివే
- Volkswagen Tiguan Exclusive Edition: పాపులర్ కారు టిగువాన్‍కు ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‍ను ఇండియాలో లాంచ్ చేసింది ఫోక్స్‌వ్యాగన్. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ లో ఆకర్షణీయమైన మార్పులతో ఈ ప్రత్యేక మోడల్ అడుగుపెట్టింది. ఈ ఎడిషన్‍కు మెరుగులు అద్దింది ఫోక్స్‌వ్యాగన్.
- Volkswagen Tiguan Exclusive Edition: పాపులర్ కారు టిగువాన్‍కు ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‍ను ఇండియాలో లాంచ్ చేసింది ఫోక్స్‌వ్యాగన్. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ లో ఆకర్షణీయమైన మార్పులతో ఈ ప్రత్యేక మోడల్ అడుగుపెట్టింది. ఈ ఎడిషన్‍కు మెరుగులు అద్దింది ఫోక్స్‌వ్యాగన్.
(1 / 8)
సరికొత్త టిగువాన్ ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్‍ను ఫోక్స్‌వ్యాగన్ ఇండియా లాంచ్ చేసింది, దీని ధర రూ.33.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
(2 / 8)
ఇంటీరియర్, ఎక్స్‌టీయర్ కు కొత్త మెరుగులు, ఆకర్షణీయమైన మార్పులతో ఈ టిగువాన్ ప్రత్యేక ఎడిషన్ ఎస్‍యూవీ వస్తోంది.
(3 / 8)
కాస్మొటిక్ మార్పులతో పాటు, ఈ టిగువాన్ వేరియంట్ విండో లైన్‍కు ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ అనే బ్యాడ్జ్ కూడా ఉంటుంది. రెండు వైట్ షేడ్స్ ఉండే ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్ ఉంటాయి. ఒరిక్స్ వైట్, ప్యూర్ వైట్ కలర్ ఆప్షన్‍లలో ఈ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ లభిస్తుంది.
(4 / 8)
ఐక్యూతో కూడిన అడాప్టివ్ ఎల్‍ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‍లైడ్లను ఫోక్స్‌వ్యాగన్ ఈ ప్రత్యేక ఎడిషన్‍కు ఇచ్చింది. వీటికి కూడా ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ అని ఉంటుంది.
(5 / 8)
సరికొత్త 18 ఇంచుల సెబ్రింగ్, స్టెర్లింగ్ సిల్వర్ ఫినిష్డ్ అలాయ్ వీల్స్, డైమనిక్ హాబ్‍క్యాప్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవి కూడా ఈ టిగువాన్ ప్రత్యేక ఎడిషన్‍లో ముఖ్యమైన మార్పుగా ఉంది.
(6 / 8)
లగేజీని లోపల పెడుతున్నప్పుడు, అన్‍లోడ్ చేస్తున్నప్పుడు కారుకు స్క్రాచ్‍లు పడకుండా ఉండేందుకు వెనుక భాగంలో లోడ్ సిట్ ప్రొటెక్షన్‍తో ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ప్రత్యేక ఎడిషన్ ఎస్‍యూవీ వస్తోంది.
(7 / 8)
కారు లోపలి భాగంలో, స్పోర్టీ లుక్ ఇచ్చే అల్యూమినియమ్ పెడల్స్ ను ఈ ప్రత్యేక ఎడిషన్ కలిగి ఉంది. స్టాండర్డ్ వెర్షన్‍తో పోలిస్తే భిన్నంగా ఉండేందుకు ఎక్స్ క్లూజివ్ ఎడిషన్ అనే బ్యాడ్జెస్ ఉంటాయి.
ఇతర గ్యాలరీలు