CRY Foundation : బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల అవగాహన- విశాఖ, హైదరాబాద్ లో క్రై సంస్థ అవేర్‌నెస్ వాక్-visakhapatnam news in telugu cry foundation walk to empower hour held in vizag hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Cry Foundation : బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల అవగాహన- విశాఖ, హైదరాబాద్ లో క్రై సంస్థ అవేర్‌నెస్ వాక్

CRY Foundation : బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల అవగాహన- విశాఖ, హైదరాబాద్ లో క్రై సంస్థ అవేర్‌నెస్ వాక్

Jan 21, 2024, 08:45 PM IST Bandaru Satyaprasad
Jan 21, 2024, 08:45 PM , IST

  • CRY Foundation Walk : దేశంలోనూ, రాష్ట్రంలోనూ బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను పరిష్కరిస్తూ,   అవగాహన పెంపొందించటం లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థ క్రై- చైల్డ్ రైట్స్ అండ్ యు (CRY) ఆదివారం విశాఖపట్నం, హైదరాబాద్ లో ‘వాక్ టు ఎంపవర్‌ హర్’ నినాదంతో అవేర్‌నెస్ వాక్ నిర్వహించింది.

విశాఖ ఆర్కే బీచ్ రోడ్‌లోని నోవాటెల్ హోటల్ నుంచి క్రై అవేర్ నెస్ వాక్ ప్రారంభమైంది. ‘‘జాతీయ బాలికల దినోత్సవం ప్రాధాన్యతను, బాలికల సాధికారత పట్ల నిబద్ధతను చాటిచెప్పటం, విద్య, రక్షణ, ఆరోగ్యం, పోషకాహరం విషయాల్లో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లపై పౌర సమాజంలో అవగాహన పెంపొందించటం ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ఈ అవేర్‌నెస్ వాక్ ఉద్దేశం’’ అని వాక్ నిర్వాహకులు, క్రై సౌత్ రీజియన్ ప్రాజెక్ట్ హెడ్ పీటర్ సునీల్ వివరించారు. 

(1 / 8)

సామాజిక కార్యకర్త, సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ (స్పెక్ట్) ఛైర్‌పర్సన్ డాక్టర్ గూడూరి సీతామహాలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొని ఈ వాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘మన దేశంలోనూ రాష్ట్రంలోనూ బాలికలు ఇప్పటికీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అసలు ఆడపిల్లలు పుట్టకముందే గర్భంలోనే చంపేస్తున్న ధోరణలు. బాలికల మీద అత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఆడపిల్లలను ఆటవస్తువులుగా, అంగడి సరుకుగా చూస్తున్నారు. ఈ పరిస్థితులను, ఆలోచనలను సవాల్ చేయాలి. అందుకు చదువు ఒక్కటే మార్గం" అన్నారు.  

(2 / 8)

యంగ్ ఇండియన్స్ వైజాగ్ చాప్టర్ ఛైర్‌పర్సన్ హర్ష నందన్‌, కో-ఛైర్‌పర్సన్ డాక్టర్ శ్రావణి సంధ్య ఈ అవేర్‌నెస్ వాక్‌లో పాల్గొన్నారు. డాక్టర్ మాధురి కొల్లూరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉత్తేజభరితంగా నిర్వహించారు. స్పెక్ట్, యంగ్ ఇండియన్స్ సంస్థలు ఈ అవేర్‌నెస్ వాక్‌కు భాగస్వాములుగా మద్దతు ఇవ్వగా, వైజాగ్ వాకర్స్, వాకర్స్ ఇంటర్నేషనల్, విశాఖ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్, సెఫా సంస్థలు పాలుపంచుకున్నాయి. ప్రభుత్వ మహిళా కళాశాల సహా పలు విద్యా సంస్థల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. 

(3 / 8)

మన బాలికలకు ఉజ్వలమైన, మరింత సురక్షితమైన భవిష్యత్తు కోసం గొంతెత్తే, శ్రమించే సామాజిక కార్యకర్తలు, ప్రభావశీలురు ఈ వాక్ ద్వారా ఒక వేదిక మీదకు వచ్చారని పీటర్ సునీల్ పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీ జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంతో పాటు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఆదివారం ఏకకాలంలో క్రై ఈ అవగాహన వాక్ లు నిర్వహించినట్లు తెలిపారు.

(4 / 8)

బాలికల భద్రత, రక్షణను సమాజంలో ప్రతి ఒక్కరూ సమిష్టి బాధ్యతగా స్వీకరించాలని తెలంగాణ పోలీస్ అదనపు డీజీపీ శిఖా గోయల్ పిలుపునిచ్చారు.  స్వచ్ఛంద సంస్థ క్రై - చైల్డ్ రైట్స్ అండ్ యు ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌లో ‘వాక్ టు ఎంపవర్‌ హర్’ నినాదంతో అవేర్‌నెస్ వాక్ నిర్వహించింది. 

(5 / 8)

ఏడీజీపీ శిఖా గోయల్ ముఖ్య అతిథిగా హాజరై, ఈ అవగాహన నడకను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికల కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ‘‘మనం సమిష్టిగా పని చేస్తే బాలికలు, మహిళల జీవితాల్లో మార్పు తీసుకురాగలం. వారి భద్రత, రక్షణ కోసం మన నిబద్ధతకు ఈ అవగాహన నడక ఒక ప్రతీకగా మారాలి. మనమందరం దీనిని బాధ్యతగా స్వీకరించి, ఈ అంశాలపై అవగాహన పెంపొందించటం కొనసాగేలా చూసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది’’ అని చెప్పారు. 

(6 / 8)

క్రై సౌత్ రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్, క్రై వాలంటీర్ ఎంగేజ్‌మెంట్ విభాగం జనరల్ మేనేజర్ అనుపమ ముహురి, క్రై ఫెలో హిమ బిందులతో పాటు.. తెలంగాణలోని క్రై ప్రాజెక్టు పరిధిలోని ముగ్గురు బాలికలు పొనగంటి సోని, పొలాల సౌమ్య, గణేష్ సత్యలు కార్యక్రమంలో పాల్గొని బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడారు. బాలికలు తమ సవాళ్లను ఏ విధంగా అధిగమించారనేది వివరించారు. పౌర సమాజం పట్టించుకుంటే బాలికల సమస్యలు పరిష్కారమవుతాయనటానికి, పరిస్థితులు మారుతాయనటానికి తాము నిదర్శనంగా చెప్పారు.

(7 / 8)

ప్రొడ్యూసర్, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు బాలికల గొంతు వినిపించటానికి వేదికలను అందిస్తాయన్నారు. ‘‘వారి కలలకు, ఆకాంక్షలకు మనమందరం అండగా నిలవాలి’’ అన్నారు. ‘జాతీయ బాలికల దినోత్సవం ప్రాధాన్యతను, బాలికల సాధికారత పట్ల సామూహిక నిబద్ధతను చాటిచెప్పటం, విద్య, రక్షణ, ఆరోగ్యం, పోషకాహరం విషయాల్లో బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లపై పౌర సమాజంలో అవగాహన పెంపొందించటం ద్వారా ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ఈ అవేర్‌నెస్ వాక్ ఉద్దేశం’’ అని ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన క్రై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ హెడ్ బడుగు చెన్నయ్య వివరించారు

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు