తెలుగు న్యూస్ / ఫోటో /
Vijayawada Flood Relief: వరదలొచ్చి రెండు నెలలైనా పూర్తి కాని పరిహారం చెల్లింపు, సర్వే లోపాలతో జనాలకు ఇక్కట్లపై ఆందోళన
- Vijayawada Flood Relief: విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా బాధితులకు పరిహారం చెల్లింపు మాత్రం పూర్తి కాలేదు. జిల్లా అధికారులు సీఎంఓను సైతం తప్పుదోవ పట్టించి పరిహారం చెల్లించేసినట్టు లెక్కలు చూపడంతో బాధితులు ఆందోళన బాట పట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
- Vijayawada Flood Relief: విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా బాధితులకు పరిహారం చెల్లింపు మాత్రం పూర్తి కాలేదు. జిల్లా అధికారులు సీఎంఓను సైతం తప్పుదోవ పట్టించి పరిహారం చెల్లించేసినట్టు లెక్కలు చూపడంతో బాధితులు ఆందోళన బాట పట్టారు. సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.
(1 / 8)
బుడమేరు వరద బాధితులకు పరిహారం చెల్లింపులో అలసత్వాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎమ్ఆర్ఓ కార్యాలయం వద్ద బాధితుల మహా ధర్నా చేపట్టారు. ఎమ్మార్వో కార్యాలయాన్ని ముట్టడించి, బాధితులు బైటాయించారు. వేలాదిగా దరఖాస్తులు ఉన్నా వాటిని పరిష్కరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వరద వచ్చి 53 రోజులు గడిచినా నేటికీ వరద బాధితులకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగాసహాయం అందలేదని ఆగ్రహించి వరద బాధితులు అజిత్ సింగ్ నగర్ లోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.
(2 / 8)
వరద సాయం చెల్లింపు కోసం ప్రజల్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతూ సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టాలని అధికారులను నిలదీశారు. విచారణ జరపకుండా కాలయాపన చేయటం ఏమిటని ప్రశ్నించారు. వరద బాధితులకు పరిహారం చెల్లించకపోవడాన్ని ప్రశ్నించారు.
(3 / 8)
ఆధార్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానించr బ్యాంకు ఖాతాలకు నేరుగా పరిహారం జమ చేసిన్టు ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటికి బాధితులకు నగదు జమ కాలేదు. అపార్ట్‌మెంట్‌లలో ఉన్నవారు, ఒకటి, రెండో అంతస్తులో ఉన్న వారిని విస్మరించారు. ఈనెల 24వ తేదీలోగా ధరఖాస్తులను పరిష్కరించి అర్హలైన బాధితుల ఖాతాలలో నష్ట పరిహారం చెల్లింపులు చేస్తామని ప్రభుత్వ యంత్రాంగం చెబుతోంది.
(4 / 8)
వరద బాధితుల సమస్యలపై బాధితులు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారులు స్పందించక పోవడంతో బాధితులు సిపిఎం నాయకత్వంలో కార్యాలయాన్ని ముట్టడించి, కార్యాలయంలో బైటాయించారు ఎట్టకేలకు అధికారులు స్పందించి బాధితుల దరఖాస్తులు స్వీకరించారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి, విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వరద నష్టంపై సమగ్ర సర్వే చేపట్టకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపిస్తున్నారు.
(5 / 8)
వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్క బాధితుడికి సహాయం అందించాలని, తక్షణమే విచారణ జరపాలని, రీ ఎన్యుమరేషన్ చేయాలని, ఇంటికి 50 వేల రూపాయలు, ఆటోకు25000, మోటార్ సైకిల్ కి పదివేలకు సహాయం పెంచాలని వినతి పత్రంలో కోరారువ్యాపారులకు నష్టాన్ని కనుగుణంగా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం ఇప్పటికీ బాధితుల్లో చాలామందికి చేరలేదు సచివాలయాల వారీగా జాబితాలు లేకపోవడం, పరిహారం చెల్లించకపోవడానికి సరైన కారణాలను సైతం వెల్లడించడం లేదు.
(6 / 8)
ప్రభుత్వం మాత్రం వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం పరంగా ఆర్థిక సహాయం అందించామని ఇప్పటి వరకు 1 లక్ష 44 వేల 672 మంది బాధితుల ఖాతాల్లో రూ. 235 కోట్ల 72 లక్షల నగదు జమ చేసినట్టు చెబుతోంది. పెండింగ్‌లో ఉన్న 2,478 ధరఖాస్తులను పరిశీలించి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుం టున్నామని, బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా చెబుతున్నారు. 179 గ్రామ వార్డు సచివాలయాలలో వరద గణన జాబితాల ప్రచురణతో పాటు అదనంగా వచ్చిన ధరఖాస్తులను పిజిఆర్‌ఎస్ ఫ్లడ్ మాడ్యూల్ లో నమోదు చేశామన్నారు.
(7 / 8)
బుడమేరు వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలని, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల పునర్నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేశారురెండు నెలల కరెంటు చార్జీలు, సంవత్సరం ఇంటి పన్నులు, మంచినీటి చార్జీలు, కాలేజీలు, స్కూళ్లల్లో ఫీజులు రద్దు చేయాలని కోరారు.
(8 / 8)
వరదల్లో సర్వం కోల్పోయిన వేలాదిమంది సహాయం అందక, పలుసార్లు దరఖాస్తులు పెట్టుకున్నా కనీసం విచారణ చేయడం లేదని, బాధితులను.. ప్రభుత్వం, అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు దొంగల్లాగా చూడటం శోచనీయమని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రీ ఎన్యుయేషన్ చేయాలని,గ్రామసభలు వార్డుల్లో నిర్వహించి పారదర్శకంగా విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇతర గ్యాలరీలు