Pawan Kalyan : ఏపీలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది- పవన్ కల్యాణ్-varanasi pm modi nomination for lok sabha seat pawan kalyan chandrababu attended ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pawan Kalyan : ఏపీలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది- పవన్ కల్యాణ్

Pawan Kalyan : ఏపీలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది- పవన్ కల్యాణ్

May 14, 2024, 05:41 PM IST Bandaru Satyaprasad
May 14, 2024, 05:41 PM , IST

  • PM Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరికొంతమంది ప్రముఖల సమక్షంలో మోదీ నామినేషన్ దాఖలు చేశారు. 

(1 / 7)

ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.

(2 / 7)

వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్టీయే కూటమి క్లీన్‌ స్విప్‌ చేయబోతోందన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో... రాబోయే ఫలితాలు ఎన్టీయే కూటమికి అనుకూలంగా వస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నాకుయ 

(3 / 7)

సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి అత్యధిక స్థానాలను అటు శాసనసభ, ఇటు లోక్‌ సభ పరంగాను ఎన్డీయే కూటమి గెలవబోతుందని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. 

(4 / 7)

2014లో మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పటి నుంచి ఆయనతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పవన్ తెలిపారు. వ్యక్తిగతంగాను మోదీఅంటే తనకు అమితమైన గౌరవం అన్నారు. దేశానికి ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నాను. 

(5 / 7)

దేశం మోదీ నాయకత్వంలో మరింత ముందుకు వెళుతుందని బలంగా నమ్ముతున్నానని పవన్ అన్నారు. ఎన్డీయే కూటమి పక్షంగా జనసేన పార్టీ తరఫున మోదీకి మద్దతుగా, ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానన్నారు. మోదీ అఖండ మెజార్టీతో వారణాసిలో గెలవబోతున్నారన్నారు.ఎన్డీయే కూటమి అత్యధిక మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు.  

(6 / 7)

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు. పవన్ కల్యాణ్, ఆయన సతీమణి అనా కొణిదెల ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి  శ్రీ అరుణ్ కుమార్ సక్సేనా వీరి వెంట ఉన్నారు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు