తెలుగు న్యూస్ / ఫోటో /
Valentines Day Gift Ideas : మీరు ఇచ్చే గిఫ్ట్ ఎప్పుడూ వాళ్లతోనే ఉండేలా చూసుకోండి
- ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజు.. ఏం గిఫ్ట్ ఇవ్వాలి. ఏం ఇస్తే.. ప్రేమించినవారికి నచ్చుతుందోనని ఆలోచనలో ఉంటారు. ఎప్పటి నుంచో ప్లానింగ్స్ వేసుకుంటారు. అయితే బడ్జెట్ కూడా చూసుకోవడం మంచిది. ఇచ్చే గిఫ్ట్ ఎప్పుడూ మీ లవర్ తో ఉండేలా చూసుకుంటే బెటర్ కదా.
- ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజు.. ఏం గిఫ్ట్ ఇవ్వాలి. ఏం ఇస్తే.. ప్రేమించినవారికి నచ్చుతుందోనని ఆలోచనలో ఉంటారు. ఎప్పటి నుంచో ప్లానింగ్స్ వేసుకుంటారు. అయితే బడ్జెట్ కూడా చూసుకోవడం మంచిది. ఇచ్చే గిఫ్ట్ ఎప్పుడూ మీ లవర్ తో ఉండేలా చూసుకుంటే బెటర్ కదా.
(1 / 6)
లెదర్ ఫార్మల్ ఆఫీస్ బ్యాగ్ ను కూడా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఇది ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. ల్యాప్‌టాప్, డాక్యుమెంట్‌లు, నోట్‌బుక్‌లు పెట్టుకునేందుకు ఈ లెదర్ ఫార్మల్ ఆఫీస్ బ్యాగ్ ఉపయోగపడుతుంది. ఇది ఇస్తే.. ప్రతి రోజు ఆ బ్యాగ్ చూసిన వెంటనే మీరు గుర్తుకు వస్తారు.
(2 / 6)
చాక్లెట్స్ గిఫ్ట్ గా ఇచ్చినా కొంతమందికి చాలా ఇష్టం. లవర్స్ డే రోజున డార్క్ చాకోలెట్, బ్రౌనీ, బేబీ కుకీస్ బిస్కెట్, నాట్స్ కాంబో, డెకోర్ లైట్స్ లాంటర్న్ కలిగి ఉన్న హ్యాంపర్‌లను బహుమతిగా అందించండి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండటంతోపాటు తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు.
(3 / 6)
బ్యూటిఫుల్ గోల్డ్ రోస్‌ను వాలెంటైన్స్ డే ప్రత్యేక బహుమతిగా ఇవ్వండి. గులాబీ ఇస్తే.. మీ ప్రేమ, స్నేహపూర్వక సంకేతాలు ఎప్పుడూ వాళ్లతోనే ఉంటాయి. ఇది పాడుకూడా అవ్వదు. తక్కువ ధరలో కూడా దొరుకుతుంది.
(4 / 6)
ప్లాటినం ఉంగరాన్ని కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. ప్రేమికుల కోసం అందంగా రూపొందించిన ప్లాటినం ఉంగరాలు దొరుకుతాయి. ప్రతిరోజూ ధరిస్తే.. మీరు ఎప్పుడూ వెంటే ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటారు.
(5 / 6)
ప్రేమలో ఇచ్చే గిఫ్ట్ ఖరీదైనదే ఉండాలనేం లేదు. మీరు ఎల్లప్పుడూ వారి వెంట ఉన్నట్టుగా ఓ గిఫ్ట్ ప్లాన్ చేస్తే చాలు. కొన్ని చిన్న బహుమతులు ఖరీదైన బహుమతుల కంటే సంతోషం. చిన్న కీచైన్ కొనుగోలు చేసి దాని మీద ఏదైనా రాసి.. బహుమతిగా ఇవ్వండి. ఈ కీచైన్ ప్రతిరోజూ వాళ్లు చూసుకుంటారు.
ఇతర గ్యాలరీలు