Natural Beard Dyes । నెరిసిన గడ్డాన్ని నలుపుగా మార్చేందుకు సహజమైన పరిష్కారాలు-use these natural dyes to color premature greying beard ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Natural Beard Dyes । నెరిసిన గడ్డాన్ని నలుపుగా మార్చేందుకు సహజమైన పరిష్కారాలు

Natural Beard Dyes । నెరిసిన గడ్డాన్ని నలుపుగా మార్చేందుకు సహజమైన పరిష్కారాలు

Nov 21, 2022, 08:03 PM IST HT Telugu Desk
Nov 21, 2022, 08:03 PM , IST

  • Natural Beard Dyes: తలపైన తెల్లవెంట్రుకలకు హెయిర్ డై వేసుకొని నలుపు చేసుకోవచ్చు, కానీ నెరిసిన గడ్డానికి రంగు వేయాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే కొన్ని చిట్కాలతో గడ్డాన్ని నల్లబరుచుకోవచ్చు.

తెల్లగడ్డానికి రంగు వేయాలంటే చర్మం పాడవుతుంది. అలా జరగకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల గడ్డం నల్లబరుచుకోవడం ఎలాగో ఇక్కడ చూడండి.

(1 / 7)

కొబ్బరినూనె, కరివేపాకు, ఉసిరి, నల్లనువ్వులను ఉపయోగించి తెల్లగడ్డాన్ని నల్లగా మార్చవచ్చు. ఎలాగో చూడండి.

(2 / 7)

కొబ్బరినూనె - ఉసిరికాయ: కొబ్బరినూనె, ఉసిరికాయలను చాలా కాలంగా జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నారు. కొబ్బరి నూనెలో ఒక చెంచా ఉసిరిని 2-3 నిమిషాలు ఉడకబెట్టండి. ఆ తర్వాత దించి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మీ గడ్డానికి అప్లై చేయండి. 15 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి.

(3 / 7)

కొబ్బరినూనె - కరివేపాకు: గడ్డం నల్లగా మారడానికి దీనిని ఉపయోగించవచ్చు. కొబ్బరి నూనెలో కరివేపాకును, తక్కువ మంట మీద వేయించాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను మీ గడ్డానికి అప్లై చేయండి. 15 నిమిషాలు ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా ఉపయోగించండి. గడ్డం నల్లబడుతుంది.

(4 / 7)

నల్ల నువ్వులు: నల్ల నువ్వులను రాత్రంతా నీటిలో నానబెట్టండి. తర్వాత మరుసటి రోజు పేస్ట్‌ను తయారు చేయండి. ఈ పేస్ట్‌ను గడ్డంపై పూయండి, ఆరిపోయాక శుభ్రం చేసుకోండి.

(5 / 7)

నిమ్మరసం, రోజ్మేరీ, వెనిగర్: ఒక కప్పు హెన్నాలో ఒక టీస్పూన్ షికాకాయ్, నిమ్మరసం, వెనిగర్, ½ టీస్పూన్ కొబ్బరి నూనె, పెరుగు కలపండి. ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు పట్టించి, ఆరిన తర్వాత కడిగేయండి.

(6 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు