Urad Dal Benefits: రోజూ మినపప్పు తింటే పక్షవాతాన్ని అడ్డుకోవచ్చు-urad dal benefits eating urad dal daily can prevent paralysis ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Urad Dal Benefits: రోజూ మినపప్పు తింటే పక్షవాతాన్ని అడ్డుకోవచ్చు

Urad Dal Benefits: రోజూ మినపప్పు తింటే పక్షవాతాన్ని అడ్డుకోవచ్చు

Published Jan 19, 2024 11:53 AM IST Haritha Chappa
Published Jan 19, 2024 11:53 AM IST

  • మినపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయి.

గారెలు, ఇడ్లీలు, బోండాలు, దోశెలు... ఇలా మినపప్పుతో చేసే వంటకాలు ఎక్కువే. మినప్పప్పుతో చేసిన వంటకాలను ప్రతి రోజూ తింటే ఎన్నో రకాల రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. 

(1 / 6)

మినపప్పులో విటమిన్లు, ఖనిజాలు, క్యాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ప్రతి రోజూ మినపప్పుతో చేసిన వంటకాలు తినే వారిలో ఆస్తమా, పక్షవాతం, ఆర్ధరైటిస్ వంటివి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. 

(2 / 6)

 అలాగే తలనొప్పి, జ్వరం వంటివి వచ్చినా త్వరగా తగ్గే అవకాశం ఉంది. మినపప్పు వల్ల మన శరీరానికి అవసరం అయిన ఇనుము అందుతుంది. దీని వల్ల రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది. శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది. 

(3 / 6)

ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ప్రతిరోజూ ఈ పప్పుతో చేసిన వంటకాలు తినడం చాలా ముఖ్యం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది. 

(4 / 6)

పిల్లలకు ప్రతిరోజూ మినపప్పుతో చేసిన వంటకాలు తినిపించాలి. వారి ఎముకలు బలంగా మారుతాయి. కాల్షియం, పొటాషియం వంటివి ఈ పప్పులో అధికంగానే ఉంటాయి. 

(5 / 6)

మినపప్పు తినడం వల్ల బరువు కూడా పెరగరు. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది, కాబట్టి ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు. తద్వారా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు