BJP Protest: మూసీ ఒడ్డున ఇళ్లు కూల్చివేతలపై బీజేపీ ఆందోళన, నిరసనలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్-union ministers participated in bjps agitation and protest against the demolition of houses on the banks of musi ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bjp Protest: మూసీ ఒడ్డున ఇళ్లు కూల్చివేతలపై బీజేపీ ఆందోళన, నిరసనలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్

BJP Protest: మూసీ ఒడ్డున ఇళ్లు కూల్చివేతలపై బీజేపీ ఆందోళన, నిరసనలో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్

Oct 25, 2024, 01:37 PM IST Bolleddu Sarath Chandra
Oct 25, 2024, 01:37 PM , IST

  •  తెలంగాణ బీజేపీ నేతలు ఇందిరా పార్క్‌ వద్ద మూసీ పరివాహక ప్రాంత బాధితులకు మద్దతుగా 'చేయి చేసిన కీడు-మూసీ బాధితులకు బీజేపీ తోడు పేరుతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేంద్ర, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. 

బీజేపీ చేపట్టిన ఆందోళనలో ఇళ్లు కోల్పోయే ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

(1 / 9)

మూసీ సుందరీకరణ పేరుతో ఇళ్ల కూల్చివేతలపై బీజేపీ ఆందోళన చేపట్టింది.  మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని నిరసనలో కేంద్ర మంత్రులు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీ నేతలు ఇందిరా పార్క్‌ వద్ద మూసీ పరివాహక ప్రాంత బాధితులకు మద్దతుగా 'చేయి చేసిన కీడు-మూసీ బాధితులకు బీజేపీ తోడు పేరుతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్ ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు.

(2 / 9)

మూసీ సుందరీకరణ కోసం గత ప్రభుత్వం కూడా పేదలను భయభ్రాంతులకు గురిచేశారని, బీఆర్‌ఎస్‌ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో పర్యటించి.. వారి బాధలు తెలుసుకున్నారని చెప్పారు. 

(3 / 9)

బీజేపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి మూసీ సుందరీకరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులు తరలి వచ్చారు. మా ఇల్లు మాకే కావాలంటూ  ప్లకార్డులు ప్రదర్శించారు. 

(4 / 9)

ఇళ్లను కోల్పోతున్న నిర్వాసితులు తమ ఇళ్లు తమకే కావాలని  ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు తమకు అవసరం లేదని  సుందరీకరణ పనులు నిలిపవేయాలని డిమాండ్ చేశారు. 

(5 / 9)

సీఎం రేవంత్‌కు సవాల్‌ చేస్తున్నానని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులతో నివాసం ఉండటానికి తాము  సిద్ధమని. చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు వెళ్ళడానికి మేం రెడీ అని ప్రకటించారు. మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు మేం వ్యతిరేకమని  పేద ప్రజల గూడు లేకుండా చేయవద్దని కోరుతున్నాను. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని డిమాండ్ చేశారు. 

(6 / 9)

మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా రేవంత్‌ ఉందా? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు . పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

(7 / 9)

రేవంత్ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఒక్క పేద వాడి ఇంటి పనికి కూడా శంకుస్థాపన చేయలేదని,  పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారని,  కష్టపడి కట్టుకున్న ఇళ్ళు కూల్చివేస్తుంటే ఏం చేయాలో తెలియక బాధితులు బిక్కుబిక్కుమంటున్నారని  పేద ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమం బీజేపీ చేస్తుందని చెప్పారు.  మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. 

(8 / 9)

మూసీ పరివాహక ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టాలని రేవంత్‌కు కల వచ్చినట్టుందని,  రేవంత్‌కి మరో సవాల్‌ చేస్తున్నానని .. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా?. మూసీ పరివాహక ప్రాంతం గురించి రేవంత్‌కి తెలుసా?. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. వాటిని కూల్చేసే దమ్ముందా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ప్రశ్నించారు.

(9 / 9)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు