తెలుగు న్యూస్ / ఫోటో /
Japan earthquake live photos : అటు భూకంపం- ఇటు సునామీ.. భయం గుప్పిట్లో జపాన్!
- Japan Tsunami : ప్రకృతి విప్పత్తుతో జపాన్ అల్లాడిపోతోంది. నూతన ఏడాది తొలి రోజు ఆనందంగా గడుపుతున్న అక్కడి ప్రజలు.. వరుస భూకంపాలు, సునామీ కారణంగా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.
- Japan Tsunami : ప్రకృతి విప్పత్తుతో జపాన్ అల్లాడిపోతోంది. నూతన ఏడాది తొలి రోజు ఆనందంగా గడుపుతున్న అక్కడి ప్రజలు.. వరుస భూకంపాలు, సునామీ కారణంగా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.
(1 / 5)
నార్త్ సెంట్రల్ జపాన్ ప్రాంతంలో సోమవారం.. 21 భూకంపాలు సంభవించాయి. ఇవన్నీ 90 నిమిషాల వ్యవధిలో నమోదయ్యాయి. వీటిల్లో అత్యధికంగా 7.6 తీవ్రతతో భూమి కంపించింది.(AFP)
(2 / 5)
భూకంపం ధాటికి జపాన్లోని ఇషికావా, నైగట, టయోమా, నోటో రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. అనేక చోట్ల రోడ్లు చీలిపోయాయి. స్తంభాలు విరిగిపోయాయి. చెట్లు కూలిపోయాయి.(via REUTERS)
(3 / 5)
వరుస భూకంపాల అనంతరం అక్కడి వాతావరణశాఖ.. సునామీ హెచ్చరికలు జారీ చేసింది. కొంతసేపటికే.. 1.2మీటర్ల ఎత్తుగల అలలు వజిమ నగరాన్ని ఢీకొట్టాయి. ఇషికావాలోని నాటో తీర ప్రాంతంలో 5 మీటర్ల ఎత్తుగల అలలు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది.(AP)
(4 / 5)
జపాన్లో సునామీ, భూకంపం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సునామీ ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత, ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు.(AP)
ఇతర గ్యాలరీలు