తెలుగు న్యూస్ / ఫోటో /
భారత్‌లో ఉపయోగిస్తున్న టాప్ ఈ-వాలెట్స్ ఇవే!
- పెద్ద నోట్ల రద్దు, కరొనా తర్వాత ఈ వాలెట్స్ డిమాండ్ పెరిగింది. గత కొన్నేళ్లగా డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. చాలా మంది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కే మొగ్గుచూపుతున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో కూడా డిజిటల్ పేమెంట్ యాప్ చెల్లింపులకు అంగీకరిస్తున్నాయి.
- పెద్ద నోట్ల రద్దు, కరొనా తర్వాత ఈ వాలెట్స్ డిమాండ్ పెరిగింది. గత కొన్నేళ్లగా డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. చాలా మంది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కే మొగ్గుచూపుతున్నారు. చిన్న చిన్న దుకాణాల్లో కూడా డిజిటల్ పేమెంట్ యాప్ చెల్లింపులకు అంగీకరిస్తున్నాయి.
(1 / 7)
డిజిటల్ వాలెట్స్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ఉపయోగిస్తున్న టాప్ ఈ-వాలెట్స్ గురించి తెలుసుకుందాం
(2 / 7)
Paytm: ఇది 2010లో ప్రారంభించబడింది, ఇది సెమీ-క్లోజ్డ్ మోడల్‌లో పనిచేస్తుంది. వినియోగదారులు డబ్బును లోడ్ చేయవచ్చు , చెల్లింపులు చేయవచ్చు. E-కామర్స్ ఇందులో అదనపు ప్రయోజనం, ఈజీగా బిల్లుల చెల్లింపులు చేయవచ్చు, డబ్బును బదిలీ చేయవచ్చు. 100 మిలియన్+ మంది దీన్ని వినియోగిస్తున్నారు(Mint_Print)
(3 / 7)
Google Pay: Google Pay భారతదేశంలో 2017లో Tez పేరుతో ప్రారంభించబడింది. భారత ప్రభుత్వ UPI అధారంగా పనిచేసింది. ఆగస్ట్ 2018లో Google.. Tezని Google Payకి రీబ్రాండ్ చేసింది. అలాగే మరిన్ని దేశాల్లో దీన్ని పరిచయం చేసింది. Google Pay Android, iOS ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లతో పాటు టాబ్లెట్‌లోనూ పని చేస్తుంది.(Google Pay Website)
(4 / 7)
BHIM యాప్: UPI- ఆధారిత BHIM యాప్‌ను NPCI అభివృద్ధి చేసింది, ఇది డిసెంబరు 2016 డిమోనిటైజేషన్ తర్వాత ప్రారంభించబడింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ 5, అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉన్న Android స్మార్ట్‌ఫోన్‌లలో, iOS 9 ఆపైన వెర్షన్‌లలో కూడా పని చేస్తోంది. ఈ యాప్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఒడియా, కన్నడ, పంజాబీ, అస్సామీ, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ, హర్యాన్వీ, భోజ్‌పురితో పాటు కొంకణితో సహా 16 భారతీయ భాషలకు సపోర్ట్ ఇస్తుంది.
(5 / 7)
Apple Pay: Apple ప్రోడక్ట్స్ అయిన iPhone, iPad, MacBookతో పాటు Apple Watch సిరీస్‌లలో Apple Pay పని చేస్తుంది. ఇతర డిజిటల్ చెల్లింపు సేవల మాదిరిగానే, Apple payకు డెబిట్, క్రెడిట్ లేదా ప్రీపెయిడ్ కార్డ్‌ని లింక్ చేయాలి.
(6 / 7)
దేశంలో అత్యధిక మంది ఉపయోగిస్తున్న యాప్ ఫోన్ పే. ఈ యాప్‌కు 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్ ఉన్నాయి
ఇతర గ్యాలరీలు