Tirumala : తిరుమలలో శాంతి హోమం, లడ్డూ ప్రసాదాలకు ఇకపై దోషాలు ఉండవు- సాయంత్రం 6 గంటలు ఇలా చేయండి :టీటీడీ
- Tirumala : తిరుమల లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద గల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. ఆహార పదార్థాలు, నైవేద్యాలు, ప్రసాదాలకు తీర్థం చల్లి, శుద్ధి చేశారు.
- Tirumala : తిరుమల లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద గల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. ఆహార పదార్థాలు, నైవేద్యాలు, ప్రసాదాలకు తీర్థం చల్లి, శుద్ధి చేశారు.
(1 / 8)
తిరుమల లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద గల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. ఆహార పదార్థాలు, నైవేద్యాలు, ప్రసాదాలకు, వాటిని తయారీ చేసే యంత్రాలకు తీర్థం చల్లి, శుద్ధి చేశారు.
(2 / 8)
శాంతి హోమం ముగిసిన అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు రుత్వికులు వాస్తు శుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డూ ప్రసాదం, నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను, అపోహలను పక్కన పెట్టవచ్చన్నారు.
(3 / 8)
ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు మాట్లాడుతూ.. యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, వాస్తు హోమం, కుంభప్రతిష్ట, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
(4 / 8)
పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు పండితులు చెప్పారు. ఇక నుంచి లడ్డూ ప్రసాదాలు, నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని, భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చని తెలిపారు.
(5 / 8)
ఇవాళ సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో, క్షమా మంత్రాలైన.... ''ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వేంకటేశాయ'' లను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరన్నారు.( రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
ఇతర గ్యాలరీలు