(1 / 6)
బియ్యం నిల్వ చేస్తే పరుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. నుసి, లద్ది పురుగులు పడతాయి. చాలాసార్లు ఈ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా వాతారణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పురుగుల బెడద మరింత అధికంగా ఉంటుంది.
(2 / 6)
బియ్యంలోని పురుగులను తొలగించడం కష్టమైన పని. అయితే, బియ్యంలో పడిన పురుగులు బయటికి వెళ్లేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ చిట్కాలు ప్రభావవంతంగా పని చేస్తాయి. అవేవంటే..
( HT File Photo)(3 / 6)
బియ్యంలో వేపాకులు వేస్తే పురుగులు పట్టకుండా ఉంటాయి. వేపాకులను ఎండబెట్టి పొడి చేసి.. వస్త్రాల్లో చిన్నచిన్న ఉండలుగా కట్టి బియ్యంలో వేసుకోవచ్చు. ఒకేవేళ అప్పటికే పురుగులు పట్టి ఉన్నా వేపను ఉపయోగించవచ్చు. వేపాకులు వేసి బియ్యాన్ని కాసేపు ఎండలో ఉంచాలి. ఆ తర్వాత పురుగులు త్వరగానే బియ్యంలోని నుంచి వెళ్లిపోతాయి.
( HT File Photo)(4 / 6)
పురుగులు పట్టిన బియ్యంలో లవంగాలు వేయాలి. దీనివల్ల పురుగులు బయటికి వెళ్లాలి. బియ్యానికి పురుగులు పట్టకుండా ముందే కూడా వేసుకోవచ్చు.
(5 / 6)
బియ్యంలో ఎండు మిర్చి వేసినా పురుగులు నిమిషాల్లోనే బయటికి వెళతాయి. బిర్యానీ ఆకులను కూడా బియ్యంలో వేయవచ్చు.
( HT File Photo)ఇతర గ్యాలరీలు