తెలుగు న్యూస్ / ఫోటో /
ఈ నాలుగు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం మొదలు.. మెండుగా ధన ప్రయోజనాలు!
- గ్రహాల రాకుమారుడు బుధుడు.. అనూరాధ నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పెరిగింది. ఈ కాలంలో వీరికి ధనలాభం ఎక్కువగా దక్కే అవకాశాలు ఉన్నాయి.
- గ్రహాల రాకుమారుడు బుధుడు.. అనూరాధ నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి లక్ష్మీ కటాక్షం పెరిగింది. ఈ కాలంలో వీరికి ధనలాభం ఎక్కువగా దక్కే అవకాశాలు ఉన్నాయి.
(1 / 5)
జ్యోతిష శాస్త్రం ప్రకారం, బుధుడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. బుధుడిని గ్రహాలకు రాకుమారుడిగా పిలుస్తారు. బుధుడు తాజాగా నవంబర్ 1న అనూరాధ నక్షత్రంలోకి ప్రవేశించాడు. నవంబర్ 11వ తేదీ వరకు అదే నక్షత్రంలో బుధుడు ఉంటాడు. దీనివల్ల అప్పటి వరకు నాలుగు రాశుల వారిపై లక్ష్మీ కటాక్షం ఎక్కువగా ఉంటుంది. చాలా లాభాలు సిద్ధిస్తాయి. ఆ రాశులు ఏవో ఇక్కడ చూడండి.
(2 / 5)
వృశ్చికం: అనూరాధ నక్షత్రంలో బుధుడి సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ధన లాభం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు పెరగొచ్చు. కొత్త ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పురోగతి ఉంటుంది. చాలా కాలం ఉన్న సమస్యలు కొన్ని పరిష్కారం కావొచ్చు.
(3 / 5)
మేషం: ఈ సంచారం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ధన పరంగా లాభలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. సహచరుల నుంచి మద్దతు పెరుగుతుంది.
(4 / 5)
మిథునం: ఈ కాలంలో మిథున రాశి వారికి అదృష్టం బాగా కలిసివస్తుంది. ఆకస్మిక ధన లాభం ఉండే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. పెట్టుబడుల నుంచి మంచి రాబడి దక్కొచ్చు.
(5 / 5)
మీనం: అనూరాధ నక్షత్రంలో బుధుడి సంచారం మీన రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి సడెన్గా ధనసిద్ధి కలిగే ఛాన్స్ ఉంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు దక్కొచ్చు. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నింటే వారికి సానుకూలంగా ఉంటుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి నిర్దిష్టమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించాలి.)
ఇతర గ్యాలరీలు