తెలుగు న్యూస్ / ఫోటో /
బుధాదిత్య రాజయోగం: ఈ నాలుగు రాశుల వారికి కలిసి రానున్న కాలం
- సూర్యుడి సంచారంతో త్వరలో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. నవంబర్ 16వ తేదీన ఈ యోగం మొదలుకానుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పెరగనుంది. ఆ వివరాలు ఇవే..
- సూర్యుడి సంచారంతో త్వరలో బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. నవంబర్ 16వ తేదీన ఈ యోగం మొదలుకానుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పెరగనుంది. ఆ వివరాలు ఇవే..
(1 / 5)
జ్యోతిష శాస్త్రం ప్రకారం, నవంబర్ 16వ తేదీ ఉదయం 7.16 గంటలకు వృశ్చిక రాశిలో సూర్యుడు ప్రవేశించనున్నాడు. అప్పటికే ఆ రాశిలో బుధుడు సంచరిస్తుంటాడు. దీంతో వృశ్చికంలో సూర్యుడు, బుధుడి కలయిక వల్ల నవంబర్ 16న బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. దీనివల్ల సుమారు నెల పాటు నాలుగు రాశుల వారికి ఎక్కువగా కలిసి రానుంది.
(2 / 5)
వృశ్చికం: సూర్యుడు వృశ్చిక రాశిలోకే ప్రవేశించనున్నాడు. దీంతో ఈ రాజయోగం కాలంలో ఈ రాశి వారికి అదృష్టం అధికం అవుతుంది. వీరికి ఆర్థికపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలంగా ఉన్న కొన్ని సమస్యలు పరిష్కారం కావొచ్చు.
(3 / 5)
తుల: బుధాదిత్య రాజయోగ కాలంలో తులా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులను కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. డబ్బు ఎక్కువగా దక్కే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
(4 / 5)
మకరం: ఈ యోగం వల్ల మకర రాశి వారికి మేలు జరుగుతుంది. ఈ కాలంలో వీరి ఆరోగ్య మెరుగ్గా ఉంటుంది. పదోన్నతి పెండింగ్లో ఉన్న ఉద్యోగులకు అది మంజూరయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాపారులకు ఆదాయం పెరగొచ్చు. చేసే పనుల్లో ఎక్కువ శాతం విజయవంతం అవుతాయి.
(5 / 5)
కుంభం: బుధాదిత్య రాజయోగం కుంభ రాశి వారికి కూడా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఉండే కొన్ని కలహాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. భూవివాదాలు ఉంటే సానుకూల ఫలితాలు రావొచ్చు. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు