తెలుగు న్యూస్ / ఫోటో /
Golden Temple : వెల్లూర్ గోల్డెన్ టెంపుల్.. నారాయణి అమ్మవారి దర్శనంతో జన్మ ధన్యం
- Golden Temple : గోల్డెన్ టెంపుల్.. ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పంజాబ్‌లోని అమృత్‌సర్ దేవాలయం. కానీ.. తమిళనాడు రాష్ట్రం వెల్లూర్ లోనూ ఓ గోల్డెన్ టెంపుల్ ఉంది. ఆ దేవాలయంలో.. నారాయణి అమ్మవారు కొలువై ఉంది. అమ్మవారి దర్శనంతో జన్మ ధన్యం అని భక్తులు నమ్ముతారు.
- Golden Temple : గోల్డెన్ టెంపుల్.. ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పంజాబ్‌లోని అమృత్‌సర్ దేవాలయం. కానీ.. తమిళనాడు రాష్ట్రం వెల్లూర్ లోనూ ఓ గోల్డెన్ టెంపుల్ ఉంది. ఆ దేవాలయంలో.. నారాయణి అమ్మవారు కొలువై ఉంది. అమ్మవారి దర్శనంతో జన్మ ధన్యం అని భక్తులు నమ్ముతారు.
(1 / 6)
తమిళనాడు రాష్ట్రం వెల్లూర్‌లో గోల్డెన్ టెంపుల్ ఉంది. దీన్ని నారాయణీ ఛారిటబుల్ ట్రస్టు వారు నిర్మించారు. 100 ఎకరాల స్థలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. దీన్ని 2007లో ప్రారంభించారు. ఈ టెంపుల్ నక్షత్రపు ఆకారంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని బంగారంతో నిర్మించారు. దాదాపు 1500 కిలోల బంగారాన్ని వినియోగించారు. (Vellore Tourism)
(2 / 6)
ఈ ఆలయ సాధారణ దర్శనం ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 వరకు ఉంటుంది. అభిషేకం ఉదయం 4:00 నుండి 8:00 వరకు, ఆరతి సేవ సాయంత్రం 6:00 నుండి రాత్రి 7:00 వరకు ఉంటుంది. ఆలయం ఏడాది పొడవునా తెరిచి ఉంటుంది. ఎవరైనా దివ్య దర్శన సేవను పొందాలనుకుంటే రూ.100 చెల్లించవలసి ఉంటుంది. ఈ సేవ ఆది, శనివారాలలో జరుగుతుంది. ఆలయం, పార్కులోకి ప్రవేశించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదు.(Vellore Tourism)
(3 / 6)
గోల్డెన్ టెంపుల్ సిటీ సెంటర్ నుండి 6 కి.మీ దూరంలో ఉంది. ప్రైవేట్ టాక్సీ, క్యాబ్, ఆటో ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. నగరం గుండా తరచూ బస్సులు తిరుగుతాయి. వెల్లూర్ చేరుకోవడానికి ప్రధాన నగరాల నుంచి బస్సు లేదా రైలులో ప్రయాణించవచ్చు. సమీప రైల్వే స్టేషన్ కాట్పాడి జంక్షన్. ఇది ఆలయం నుండి 20.6 కి.మీ ఉంటుంది. బస్సులో వెళితే తొందరగా చేరుకోవచ్చు.(Vellore Tourism)
(4 / 6)
గోల్డెన్ టెంపుల్ సమీపంలో.. ప్రభుత్వ మ్యూజియం ఉంది. ఇక్కడ అతి పురాతనమైన వస్తువులను భద్రపరిచారు. చిన్నారులను తీసుకెళ్తే.. వారు చాలా విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ మ్యూజియం తమిళనాడు చరిత్రకు అద్దం పడుతుంది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరు చరిత్ర, వారు వాడిన ఆయుధాలు, ప్రధాన ఘట్టాల గురించి ఈ మ్యూజియంకు వెళితే తెలుసుకోవచ్చు. (Vellore Tourism)
(5 / 6)
నారాయణీ అమ్మవారి ఆలయానికి అతి సమీపంలో వెల్లూరు ఫోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యపరిచే కట్టడాలు కనిపిస్తాయి. రాతి కట్టడాల మధ్యలో నీటిని నిల్వ చేస్తారు. ఈ దృశ్యాలు చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. (Vellore Tourism)
(6 / 6)
వెల్లూర్ ఫోర్ట్‌కు సమీపంలోనే.. సెయింట్ జాన్స్ చర్చ్ ఉంటుంది. ఈ కట్టడం అద్బుతంగా ఉంటుంది. తమిళనాడుకు చెందిన ప్రముఖులు ఈ చర్చ్‌లో ప్రార్థన చేయడానికి వస్తారు. దీన్ని బ్రిటీష్ కాలంలో నిర్మించినా.. ఇప్పటి వరకూ చెక్కుచెదరలేదు. ఈ చర్చ్ పరిసరాలు ఎంతో ప్రశాంతంగా ఉంటాయి. ఒక్కసారి వెల్లూర్ వెళితే.. ఇవన్నీ చుట్టేయొచ్చు. (Vellore Tourism)
ఇతర గ్యాలరీలు