Hyderabad Elevated Corridor : ఇక ట్రాఫిక్ ఫ్రీ జర్నీ.. ORR వరకు నేరుగా రావొచ్చు - 'ఎలివేటెడ్ కారిడార్' ప్రత్యేకతలివే
- Rajiv Rahadari Elevated Corridor in Telangana : ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలకమైన రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్‌కు గురువారం సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ రహదారి పూర్తితో కరీంనగర్ వైపు మెరుగైన ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ముఖ్య వివరాలు ఇలా ఉన్నాయి….

(1 / 5)
రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ మార్గం: ప్యారడైజ్ జంక్షన్-వెస్ట్ మారేడ్‌పల్లి-కార్ఖానా-తిరుమలగిరి-బొల్లారం-అల్వాల్-హకీంపేట్-తూంకుంట- ఓఆర్ ఆర్ జంక్షన్ (శామీర్‌పేట్) (CMO Twitter Telangana)
(2 / 5)
ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట వరకు 6 లేన్లతో 11.3 కిలోమీటర్ల పొడవున ఈ కారిడార్ నిర్మాణం ఉంటుంది. (CMO Twitter Telangana)
(3 / 5)
రాజీవ్ రహదారి ఎలివేటేడ్ కారిడార్ పూర్తయితే మేడ్చల్, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందడమే కాకుండా, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రయాణం సులభతరం అవుతుంది. మొత్తం కారిడార్ పొడవు: 18.10 కి.మీ. ఉండనుండగా… ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 11.12 కి.మీ.గా ఉంటుంది.(CMO Twitter Telangana)
(4 / 5)
అండర్‌గ్రౌండ్ టన్నెల్: 0.3 కి.మీ. ఉంటుంది. ఫియర్స్: 287 ఉండనుండగా… 197.20 భూమి అవసరం. ఇందులో రక్షణ శాఖకు చెందిన 113.48 ఎకరాల భూమి ఉంది. ప్రైవేట్ ల్యాండ్, 83.72 ఎకరాలు ఉంది.(CMO Twitter Telangana)
(5 / 5)
ప్రాజెక్టు వ్యయం: రూ.2,232 కోట్లుగా ఉంది. ఈ నిర్మాణం పూర్తి అయితే సికింద్రాబాద్‌తో పాటు కరీంనగర్ వైపు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడుతుంది. కరీంనగర్ వైపు మెరుగైన ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఇంధనం మిగులుతో వాహననదారులకు వ్యయం తగ్గనుంది. నగరం నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ ఆర్ వరకు చేరుకునే అవకాశం ఉంటుంది.(CMO Twitter Telangana)
ఇతర గ్యాలరీలు