World Mosquito day: దోమలతో వ్యాప్తి చెందే అయిదు భయానక వ్యాధులు ఇవే, ఇవి ప్రాణాలు తీస్తాయి-these are the five dreaded mosquito borne diseases that can take lives ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  World Mosquito Day: దోమలతో వ్యాప్తి చెందే అయిదు భయానక వ్యాధులు ఇవే, ఇవి ప్రాణాలు తీస్తాయి

World Mosquito day: దోమలతో వ్యాప్తి చెందే అయిదు భయానక వ్యాధులు ఇవే, ఇవి ప్రాణాలు తీస్తాయి

Aug 20, 2024, 09:40 AM IST Haritha Chappa
Aug 20, 2024, 09:40 AM , IST

  • World Mosquito day: మలేరియా వ్యాప్తికి ఆడ దోమలే కారణమని బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ కనిపెట్టినందుకు గుర్తుగా ప్రపంచ దోమల దినోత్సవాన్ని ఆగస్టు 20న నిర్వహించుకోవడం మొదలుపెట్టాం. దోమకాటు వల్ల  అయిదు భయానక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ఆడ అనాఫిలిస్ దోమల కాటు ద్వారా వ్యాపించే పరాన్నజీవుల వల్ల మలేరియా వస్తుంది. మలేరియాను నివారించడానికి కొన్ని ఉత్తమ మార్గాలు దోమతెరలు, యాంటీ మలేరియా మందులను ఇంటి లోపల పిచికారీ చేయడం. క్వినైన్ అనేది మలేరియా చికిత్సకు ఉపయోగించే మందు.

(1 / 6)

డెంగ్యూ సంక్రమణ ఫ్లూ లాంటి అనారోగ్యానికి కారణమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  డెంగ్యూ ప్రపంచ దేశాల్లో పెరిగిందని నివేదించింది, ప్రపంచ జనాభాలో సగం మంది ప్రజలు డెంగ్యూ వచ్చే ప్రమాదంలో ఉన్నారు.  డెంగ్యూకు నిర్దిష్ట చికిత్స లేనప్పటికీ, దీన్ని ముందుగానే గుర్తించడం వల్ల మరణాల రేటును తగ్గిస్తుంది.

(2 / 6)

పగటిపూట కుట్టే ఈడిస్ దోమల ద్వారా వ్యాపించే వైరస్ వల్ల జికా వైరస్ వస్తుంది. ఇది సోకితే తేలికపాటి జ్వరం, దద్దుర్లు, కండ్లకలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటివి కనిపిస్తాయి. ఇవి 2 నుండి 7 రోజుల వరకు ఉంటాయి. చాలా మందికి ఏ లక్షణాలు కనిపించకుండా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

(3 / 6)

ఈడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా చికెన్ గున్యా వ్యాపిస్తుంది. ఇది డెంగ్యూకు కూడా కారణమవుతుంది.  తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, కండరాల నొప్పి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కొన్ని వారాల పాటు కనిపిస్తాయి.

(4 / 6)

ఎల్లో ఫీవర్ అనేది సోకిన దోమల ద్వారా వ్యాపించే తీవ్రమైన వైరల్ రక్తస్రావం వ్యాధి. ఎల్లో ఫీవర్ వస్తే జ్వరం, తలనొప్పి, కామెర్లు, కండరాల నొప్పి, వికారం, వాంతులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన రోగులలో తక్కువ శాతం మంది తీవ్రమైన లక్షణాలను ఎదుర్కొంటారు.  మరణించిన వారిలో సగం మంది 7 నుండి 10 రోజుల్లో మరణించవచ్చు.

(5 / 6)

ఎల్లో ఫీవర్ అనేది సోకిన దోమల ద్వారా వ్యాపించే తీవ్రమైన వైరల్ రక్తస్రావం వ్యాధి. ఎల్లో ఫీవర్ వస్తే జ్వరం, తలనొప్పి, కామెర్లు, కండరాల నొప్పి, వికారం, వాంతులు, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన రోగులలో తక్కువ శాతం మంది తీవ్రమైన లక్షణాలను ఎదుర్కొంటారు.  మరణించిన వారిలో సగం మంది 7 నుండి 10 రోజుల్లో మరణించవచ్చు.(pexel)

దోమ కాటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. దోమలు  ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వేప నూనెను నీటితో కలిపి పిచికారీ చేయవచ్చు. తద్వారా దోమలు అదుపులో ఉంటాయి.

(6 / 6)

దోమ కాటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోండి. దోమలు  ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వేప నూనెను నీటితో కలిపి పిచికారీ చేయవచ్చు. తద్వారా దోమలు అదుపులో ఉంటాయి.(pexel)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు