Thangalaan 2: తంగలాన్‍ పార్ట్-2 వస్తుంది: హీరో విక్రమ్.. ఆస్కార్‌కు పంపుతామన్న ప్రొడక్షన్ హౌస్-thangalaan part 2 to come soon says chiyaan vikram at thank you meet ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Thangalaan 2: తంగలాన్‍ పార్ట్-2 వస్తుంది: హీరో విక్రమ్.. ఆస్కార్‌కు పంపుతామన్న ప్రొడక్షన్ హౌస్

Thangalaan 2: తంగలాన్‍ పార్ట్-2 వస్తుంది: హీరో విక్రమ్.. ఆస్కార్‌కు పంపుతామన్న ప్రొడక్షన్ హౌస్

Aug 16, 2024, 10:24 PM IST Chatakonda Krishna Prakash
Aug 16, 2024, 10:19 PM , IST

  • Thangalaan 2: తంగలాన్ సినిమా థాంక్యూ ప్రెస్‍మీట్ హైదరాబాద్‍లో నేడు (ఆగస్టు 16) జరిగింది. ఈ మూవీకి సీక్వెల్ వస్తుందని హీరో విక్రమ్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ప్రేమిస్తున్నారని చెప్పారు.

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్ర పోషించిన పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా తంగలాన్ ఈ గురువారం (ఆగస్టు 15) థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. మంచి ఓపెనింగ్ అందుకుంది. ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించారు. 

(1 / 5)

హైదరాబాద్‍లో నేడు (ఆగస్టు 16) తంగలాన్ తెలుగు వెర్షన్ కోసం థ్యాంక్ యూ మీట్‍ను మూవీ టీమ్ నిర్వహించింది. ఈ ఈవెంట్‍లో హీరో విక్రమ్ మాట్లాడారు. తంగలాన్ సినిమాకు పార్ట్ 2 వస్తుందని కన్ఫర్మ్ చేసేశారు.

(2 / 5)

తంగలాన్ మూవీని అందరూ ఇష్టపడుతున్నారని, అందుకే సీక్వెల్‍గా పార్ట్ 2 తెస్తామని విక్రమ్ వెల్లడించారు. “మీరందరూ తంగలాన్ సినిమాను ప్రేమిస్తున్నారు కాబట్టి.. పార్ట్-2 చేయాలనుకుంటున్నాం. నేను, పా రంజిత్, జ్ఞానవేల్ ఈ విషయంపై మాట్లాడుకున్నాం. పా రంజిత్ ఫ్రీ అయ్యాక పార్ట్ 2 చేస్తాం. మీ మద్దతు చూసే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని విక్రమ్ చెప్పారు. 

(3 / 5)

తంగలాన్ సినిమా మాస్టర్‌పీస్‍లా నిలిచిపోయిందని స్టూడియోగ్రీన్ ప్రొడక్షన్ హౌస్ సీఈవో ధనుంజేయన్ చెప్పారు. ఆస్కార్ అవార్డు వరకు ఈ సినిమాను తీసుకెళ్లాలని ప్రేక్షకులు కోరుతున్నారని ఆయన చెప్పారు. స్టూడియో గ్రీన్ ఈ మూవీని కచ్చితంగా ఆస్కార్ రేసుకు తీసుకెళుతుందని అన్నారు. తంగలాన్ మూవీని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ నిర్మించారు. 

(4 / 5)

తంగలాన్ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.26.44 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ మూవీలో విక్రమ్ నటనకు భారీగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కూడా లీడ్ రోల్స్ చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు