AP TG Weather ALERT : రాయలసీమ వరకు విస్తరించిన ద్రోణి - ఇవాళ, రేపు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు-telangana will receive heavy rains these two days imd latest weather report here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Tg Weather Alert : రాయలసీమ వరకు విస్తరించిన ద్రోణి - ఇవాళ, రేపు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

AP TG Weather ALERT : రాయలసీమ వరకు విస్తరించిన ద్రోణి - ఇవాళ, రేపు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

Sep 29, 2024, 02:43 PM IST Maheshwaram Mahendra Chary
Sep 29, 2024, 02:43 PM , IST

  • AP Telangana Rains : అంతర్గత తమిళనాడు నుంచి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి ఏర్పడింది. అది ఇప్పుడు కొమొరిన్ ప్రాంతం నుంచి అంతర్గత తమిళనాడు ద్వారా రాయలసీమ వరకు విస్తరించి ఉందని వాతావరణశాఖ తాజా బులెటిన్ లో పేర్కొంది. 

(1 / 7)

ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో మూడు నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు సీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది.

(2 / 7)

ఏపీలో ఇవాళ(ఆదివారం) పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(3 / 7)

ఇక శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందిని  ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

(4 / 7)

తెలంగాణలో చూస్తే మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 

(5 / 7)

రేపు(సోమవారం) ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మబూబాబాద్, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

(6 / 7)

అక్టోబర్ 1 నుంచి తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు