తెలుగు న్యూస్ / ఫోటో /
PM Fasal Bima Yojana : ఫసల్ బీమా యోజనలో చేరిన 'తెలంగాణ' - అమలు వివరాలివే
- Pradhan Mantri Fasal Bima Yojana in Telangana : అన్నదాతలకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రైతులకు రక్షణగా నిలిచేందుకు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)లో తిరిగి చేరింది. ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…..
- Pradhan Mantri Fasal Bima Yojana in Telangana : అన్నదాతలకు అలర్ట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. రైతులకు రక్షణగా నిలిచేందుకు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)లో తిరిగి చేరింది. ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…..
(1 / 6)
ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన స్కీమ్ లోకి తిరిగి తెలంగాణ ప్రభుత్వం చేరింది. (PMFBY Twitter)
(2 / 6)
2016 నుంచి 2020 వరకు తెలంగాణ ప్రభుత్వం ఈ స్కీమ్ లో భాగమైంది. ఆ తర్వాత నాటి ప్రభుత్వం దాని నుంచి ఉపసంహరించుకుంది.(PMFBY Twitter)
(3 / 6)
శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పీఎంఎఫ్‌బీవై సీఈవో, కేంద్ర సంయుక్త కార్యదర్శి రితేష్ చౌహాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఎంఎఫ్ బీవైలో 2016 నుంచి 2020 వరకు తెలంగాణ ఉన్న విషయం, ఆ తర్వాత నాటి ప్రభుత్వం దాని నుంచి ఉప సంహరించుకున్న తీరుపై చర్చ జరిగింది. (CMO Telangana Twitter)
(4 / 6)
పీఎంఎఫ్‌బీవైలోకి తెలంగాణ ప్రభుత్వం తిరిగిచేరడంతో వచ్చే పంట కాలం నుంచి రైతులు ఈ పథకం నుంచి పంటల బీమా పొందనున్నారు. పీఎంఎఫ్ బీవైతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని, పంటలు నష్టపోయినప్పుడు సకాలంలోనే పరిహారం అందుతుందని రితేష్ చౌహాన్ తెలియజేశారు(CMO Telangana Twitter)
(5 / 6)
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో రైతు కేంద్రిత విధానాల అమలుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.(PMFBY Twitter)
(6 / 6)
2016 వానాకాలం సీజన్ నుంచి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పథకం అమల్లోకి వచ్చింది. దీనికి చెల్లించే ప్రీమియంలో రైతులతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంతమేర సొమ్మును తమ వాటాగా భరిస్తాయి. అయితే ఈ స్కీమ్ అమలులో రైతుల కంటే బీమా కంపెనీలే ఎక్కువగా లాభాపడ్డాయనే వాదన ఉంది. ప్రీమియ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు