(1 / 6)
కొద్దిరోజులుగా ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. మరో ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు పేర్కొంది.
(2 / 6)
ఏపీలో ఇవాళ (ఆగస్టు 18) శ్రీకాకుళం, విజయనగరం,అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం మరియు నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 6)
కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
(4 / 6)
ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్,సంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(5 / 6)
ఆగస్టు 22వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆయా జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
(6 / 6)
ఆగస్టు 22 నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
ఇతర గ్యాలరీలు