తెలుగు న్యూస్ / ఫోటో /
Bhadrakali Temple: సరికొత్తగా ‘భద్రకాళి’.. త్వరలోనే పునరుద్ధరణ పనులు, నమూనా చిత్రాలివే
- Renovate Bhadrakali Temple: భద్రకాళి అమ్మవారి ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. పునర్నిర్మాణానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైన నేపథ్యంలో… టెండర్లను కూడా ఖరారు చేసే పనిలో పడింది. ఇప్పటికే నమూనా చిత్రాలు విడుదలయ్యాయి. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి.
- Renovate Bhadrakali Temple: భద్రకాళి అమ్మవారి ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. పునర్నిర్మాణానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైన నేపథ్యంలో… టెండర్లను కూడా ఖరారు చేసే పనిలో పడింది. ఇప్పటికే నమూనా చిత్రాలు విడుదలయ్యాయి. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి.
(1 / 5)
భద్రకాళి ఆలయ సమగ్ర అభివృద్ధి ప్రక్రియ మొదలైంది. వరంగల్ నగరాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా రూ.30 కోట్లతో భద్రకాళి ఆలయంలో మాడవీధులను, తొమ్మిది అంతస్తుల రాజగోపురం, ఆలయ ఆవరణలో పూర్తిగా గార్డెనింగ్, భక్తులకు అవసరమైన వసతులను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే మాడవీధులు, రాజగోపురం నిర్మాణల కోసం డిజైన్‌లు సిద్ధమయ్యాయి. ఈ చిత్రంలోని మాదిరిగా ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతాయి.(twitter)
(2 / 5)
ఆలయం చుట్లూ మాడ వీధులను నిర్మించనున్నారు. మాడ వీధులు నిర్మాణం చేయడంతో ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. ఆమ్మవారి ఉత్సవాల సమయంలో నిర్వహించే రథోత్సాలు, వాహన సేవలు మాడవీధుల్లోనే జరుగనున్నాయి.(facebook)
(3 / 5)
ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద గోపురం నిర్మించడంతోపాటు తెప్పోత్సవానికి అనుగుణంగా కొలనును నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. మాడవీధులు, గోపురం, తెప్పోత్సవానికి కొలనుతో ఆలయం కొత్తరూపు సంతరించుకోనుంది.(twitter)
(4 / 5)
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.20 కోట్లు మంజూరు చేయగా, ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్ల బడ్జెట్‌ను కుడాకు అప్పగించారు. ‘భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత సుసంపన్నం చేయటమే లక్ష్యంగా పునరుద్ధరణ పనులు కొనసాగనున్నాయి. (facebook)
(5 / 5)
‘ఆగమశాస్త్ర’ సూత్రాలకు కట్టుబడి భద్రకాళి ఆలయం చుట్టూ 830 మీటర్ల పొడవు, 33 అడుగుల వెడల్పుతో ‘మాడవీధులు’ నిర్మించనున్నారు. అదనంగా, ఆలయం నుండి భద్రకాళి సరస్సు వరకు సుమారు 100 మీటర్లు విస్తరించి ఒక ప్రాకారాన్ని నిర్మిస్తారు. ఈ పునరుద్ధరణలను సులభతరం చేయడానికి, ఆలయానికి ఆనుకుని ఉన్న కొన్ని నిర్మాణాలు, అర్చకుల నివాసం, యాగశాల, వంతశాల, అన్నదాన సత్రం, వేద పాఠశాల మరియు ఇతర భవనాలను కూల్చివేసి, ఆలయ ప్రాంగణం వెలుపల పునర్నిర్మిస్తారు.
ఇతర గ్యాలరీలు