
(1 / 7)
ఉదయమే సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ స్వాగతం పలికారు. పుష్పగుచ్చం ఇచ్చి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

(2 / 7)

(3 / 7)
తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా సచివాలయంలో చేపట్టిన పోలీసుల కవాత్తు ఆకట్టుకుంది. పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం కేసీఆర్ స్వీకరించారు.

(4 / 7)
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో ప్రజలందరికీ సిఎం శుభాకాంక్షలు తెలిపారు. స్వప్నించి, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రనీ, పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్నీ ఘనంగా తలుచుకుందామని పిలుపునిచ్చారు. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందామన్నారు.

(5 / 7)
2001 వరకూ తెలంగాణలో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలిందన్నారు కేసీఆర్. “ఇంకెక్కడి తెలంగాణ” అనే నిర్వేదం జనంలో అలుముకున్నదని ఆ నిర్వేదాన్ని, నిస్పృహని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రాత్మక పాత్ర లభించినందుకు తన జీవితం ధన్యమైందని వ్యాఖ్యానించారు.

(6 / 7)
సచివాలయంలో నిర్వహించిన దశాబ్ధి ఉత్సవాలకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా హాజరయ్యారు. ఎమ్మెల్సీ కవితతో ముచ్చటిస్తూ కనిపించారు.

(7 / 7)
ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు, ముఖ్య అధికారులు హాజరయ్యారు.
ఇతర గ్యాలరీలు