Telangana Congress : వారికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వం.. నేతలకు షాకిచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్‌-telangana congress chief mahesh kumar goud key comments in the review of warangal district leaders ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Telangana Congress : వారికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వం.. నేతలకు షాకిచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్‌

Telangana Congress : వారికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వం.. నేతలకు షాకిచ్చిన టీపీసీసీ చీఫ్ మహేష్‌

Sep 21, 2024, 05:48 PM IST Basani Shiva Kumar
Sep 21, 2024, 05:48 PM , IST

  • Telangana Congress : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరిగా పనిచేయని నేతలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

వరంగల్‌ జిల్లా నేతల సమీక్షలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకుంటే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కొత్త, పాత నాయకులు కలిసి పని చేయాలని సూచించారు. పదవులు వచ్చిన వాళ్లు ఓ మెట్టు దిగి ప్రవర్తిచాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ నేతలకు సూచించారు.

(1 / 5)

వరంగల్‌ జిల్లా నేతల సమీక్షలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌ మహేష్‌ కుమార్ గౌడ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకుంటే.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. కొత్త, పాత నాయకులు కలిసి పని చేయాలని సూచించారు. పదవులు వచ్చిన వాళ్లు ఓ మెట్టు దిగి ప్రవర్తిచాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ నేతలకు సూచించారు.(@INCTelangana)

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా నియమితులైన కొద్ది రోజులకే.. మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలు, పార్టీ అనుబంధ విభాగాలతో మహేష్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో ఓటింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వాటికి నేతలను సిద్ధం చేస్తున్నారు.

(2 / 5)

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా నియమితులైన కొద్ది రోజులకే.. మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలు, పార్టీ అనుబంధ విభాగాలతో మహేష్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో ఓటింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వాటికి నేతలను సిద్ధం చేస్తున్నారు.(@INCTelangana)

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లడంపై టీపీసీసీ చీఫ్ పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. టీపీసీసీ కమిటీల పునర్వ్యవస్థీకరణకు ముందు మహేశ్ జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లా నేతలు ఏదో ఒక పదవి ఇవ్వాలంటూ పార్టీ కార్యాలయంలో చక్కర్లు కొడుతున్నారు. ఈ సమావేశాల్లో వారి వినతులు కూడా స్వీకరిస్తున్నారు. 

(3 / 5)

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లడంపై టీపీసీసీ చీఫ్ పార్టీ కార్యకర్తలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. టీపీసీసీ కమిటీల పునర్వ్యవస్థీకరణకు ముందు మహేశ్ జిల్లా స్థాయి సమావేశాలను నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లా నేతలు ఏదో ఒక పదవి ఇవ్వాలంటూ పార్టీ కార్యాలయంలో చక్కర్లు కొడుతున్నారు. ఈ సమావేశాల్లో వారి వినతులు కూడా స్వీకరిస్తున్నారు. (@INCTelangana)

శనివారం వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ డీసీసీలతో మహేశ్ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు డీసీసీ అధ్యక్షులు, జిల్లా సంబంధిత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరయ్యారు. 

(4 / 5)

శనివారం వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ డీసీసీలతో మహేశ్ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు డీసీసీ అధ్యక్షులు, జిల్లా సంబంధిత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు హాజరయ్యారు. (@INCTelangana)

ఇవి సాధారణ సమావేశాలే అని కాంగ్రెస్ నేతలు బయటకు చెబుతున్నారు. కానీ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తానని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నదే తన ప్రయత్నమని స్పష్టం చేశారు.

(5 / 5)

ఇవి సాధారణ సమావేశాలే అని కాంగ్రెస్ నేతలు బయటకు చెబుతున్నారు. కానీ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తానని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నదే తన ప్రయత్నమని స్పష్టం చేశారు.(@INCTelangana)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు