TG Cabinet Meeting : ఈనెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ - రైతు భరోసా, రేషన్ కార్డులపై కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..!
- Telangana Cabinet Meeting :ఈనెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. రైతు భరోసా విధివిధానాలు, రుణమాఫీ, రైతు బీమా స్కీమ్ తో పాటు హైడ్రాకు చట్టబద్ధత, కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన అంశాలపై చర్చించనుంది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
- Telangana Cabinet Meeting :ఈనెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. రైతు భరోసా విధివిధానాలు, రుణమాఫీ, రైతు బీమా స్కీమ్ తో పాటు హైడ్రాకు చట్టబద్ధత, కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన అంశాలపై చర్చించనుంది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
(1 / 6)
సెప్టెంబర్ 20వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ఈ సమావేశం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
(2 / 6)
కేబినెట్ భేటీలో రైతు భరోసా విధివిధానాలు, రుణమాఫీ, రైతు బీమా స్కీమ్ తో పాటు హైడ్రాకు చట్టబద్ధత, కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన అంశాలపై చర్చించనుంది.
(3 / 6)
రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాలపై చర్చించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. మరోవైపు పంట పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న రైతు భరోసా విధివిధానాలపై చర్చించనున్నారు.
(4 / 6)
హైడ్రాకు చట్టబద్ధత కూడా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదే విషయంపై కేబినెట్ భేటీలో చర్చించి… ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. చట్టబద్ధత కల్పించడానికి వీలుగా ఆర్డినెన్స్ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
(5 / 6)
ఇటీవలే రాష్ట్రంలో సంభవించిన భారీ వరదలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కేంద్రం నుంచి సాయం రాబట్టే విషయాలపై మంత్రివర్గం సమాలోచనలు చేయనుంది.
(6 / 6)
బీసీ కుల గణన అంశం కేబినెట్ లో ప్రస్తావనకు రానుంది. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసిన సర్కార్… ఈ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. కులగణనకు సంబంధించిన సర్వే మార్గదర్శకాలను మంత్రిమండలి భేటీలో ఆమోదిస్తుందని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రేషన్ కార్డు అర్హతలు, తీసుకురావాల్సిన మార్పులపై చర్చించనున్నారు. ఇక ఆరోగ్య శ్రీకి రేషన్ కార్డులో సంబంధం లేకుండా చికిత్స అందించే విషయంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇవే కాకుండా మరికొన్ని అంశాలపై తెలంగాణ మంత్రి వర్గం చర్చించనుంది.
ఇతర గ్యాలరీలు