తెలుగు న్యూస్ / ఫోటో /
Weather Report : తెలంగాణకు బిగ్ అలర్ట్ - ఈ నెల 9, 10 తేదీల్లో అతి భారీ వర్షాలు! ఐఎండీ తాజా హెచ్చరికలివే
- ఏపీ, తెలంగాణలో మరో మూడు నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తాజా బులెటిన్ లో పేర్కొంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

(1 / 6)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య బంగాళాఖాతం మరియు అనుకుని ఉన్న ఉత్తర బంగాఖాఖాతం మీద ఉందని ఐఎండీ తాజా బులెటిన్ లో పేర్కొంది. దానికి అనుబంధంగా ఉపరితల అవర్తనం సముద్రమట్టానికి సగటున 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. సెప్టెంబర్ 9వ తేదీ నాటికి బెంగర్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంలోని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసింది.
(2 / 6)
ఐఎండీ రిపోర్ట్ ప్రకారం… ఇవాళ, రేపు, ఎల్లుండి ఉత్తర, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
(3 / 6)
రాయలసీమ జిల్లాల్లో ఈ మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
(4 / 6)
ఇక తెలంగాణలో చూస్తే ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. శనివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ప్రకటించింది.
(5 / 6)
సెప్టెంబర్ 8 నుంచి మళ్లీ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9వ తేదీన ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఇతర గ్యాలరీలు