తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : ఐఎండీ అలర్ట్... ఇవాళ, రేపు భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది . ఆయా ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

(1 / 6)
ఏపీ, తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. రెండు మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
(2 / 6)
ఇవాళ ఏపీలో(ఆగస్టు 2) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(3 / 6)
మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
(4 / 6)
హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం... ఈ మూడు రోజులు స్థిరమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. గాలి వేగం గంటకు 30 -40 మధ్య ఉంటుందని తెలిపింది. ఇవాళ ఉదయం 08. 30 గంటలలోపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
(5 / 6)
ఇవాళ ఉదయం 8 నుంచి రేపు ఉదయం 08. 30లోపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇతర గ్యాలరీలు