తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : ద్రోణి ఎఫెక్ట్...! ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన, ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Telangana Rains Updates : తెలుగు రాష్ట్రాల్లో మరికొన్నిరోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Rains Updates : తెలుగు రాష్ట్రాల్లో మరికొన్నిరోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
తెలుగు రాష్ట్రాల్లో మరికొన్నిరోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
(3 / 6)
ద్రోణి ప్రభావంతో ఇవాళ(జూన్ 15) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
(4 / 6)
ఇక తెలంగాణలో చూస్తే…రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
(5 / 6)
శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.శనివారం(జూన్ 15) నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట,జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
(6 / 6)
ఆదివారం(జూన్ 16) నిజామబాద్, రాజన్న సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి, ములుగు, భదాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.జూన్ 21వ తేదీ వరకు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందిని పేర్కొంది.
ఇతర గ్యాలరీలు