తెలుగు న్యూస్ / ఫోటో /
AP TG Weather Updates : హైదరాబాద్‌లో బలమైన ఉపరితల గాలులు వీచే ఛాన్స్..! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ
- AP Telangana Rain Updates : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Rain Updates : తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
నైరుతి రుతుపవనాల విస్తరణ నుంచి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా చూస్తే పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఇక ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా, గోదావరి బేసిన్లలో వరద ప్రవాహం కొనసాగుతోంది.(Image Source From @APSDMA Twitter)
(2 / 6)
హైదరాబాద్ నగరంలో చూస్తే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.(Image Source From @APSDMA TwitterImage Source From @APSDMA Twitter)
(3 / 6)
ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో చూస్తే... భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. స్థిరమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. (Image Source From @APSDMA Twitter)
(4 / 6)
రేపు (జులై 26) ఉదయం 8. 30 గంటల తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 30- 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.(Image Source From @APSDMA Twitter)
(5 / 6)
జులై 27 నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.(Image Source From @APSDMA Twitter)
(6 / 6)
ఏపీలో చూస్తే రేపు (జులై 26) మన్యం,అల్లూరి,ఏలూరు జిల్లాల్లోని అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. • కాకినాడ,కోనసీమ, తూగో,పగో, కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం,నంద్యాల,కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.(Image Source From @APSDMA Twitter)
ఇతర గ్యాలరీలు