తెలుగు న్యూస్ / ఫోటో /
Jagan Tadepalli House : మాజీ సీఎం జగన్ ఇంటికి 30 మంది ప్రైవేట్ సిబ్బందితో భద్రత, తాడేపల్లి రహదారిలో ప్రజలకు అనుమతి!
- Jagan Tadepalli House : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాస మార్గంలో రహదారిని సాధారణ ప్రజలకు అందుబాటులో తెచ్చింది ప్రభుత్వం. అయితే జగన్ ఇంటి వద్ద 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారు.
- Jagan Tadepalli House : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాస మార్గంలో రహదారిని సాధారణ ప్రజలకు అందుబాటులో తెచ్చింది ప్రభుత్వం. అయితే జగన్ ఇంటి వద్ద 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారు.
(1 / 6)
ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాస మార్గంలో రహదారిని సాధారణ ప్రజలకు అందుబాటులో తెచ్చింది ప్రభుత్వం. అయితే జగన్ ఇంటి వద్ద 30 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసుకున్నారు.
(2 / 6)
మాజీ సీఎం జగన్ నివాసం దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. ఆయన నివాసం, క్యాంప్ ఆఫీస్ దగ్గర 30 మంది సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. జగన్ నివాస మార్గంలో సాధారణ వాహనాలకు అనుమతి ఇవ్వడంతో వైసీపీ ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంది.
(3 / 6)
జగన్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటుపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. తన ఇంటి ముందుకు మీడియా వస్తేనే జగన్ భరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు టీడీపీ నేత, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి.
(4 / 6)
చంద్రబాబు ఇంటి మీద డ్రోన్లు ఎగరేసిన సంగతి మరిచారా జగన్ అంటూ అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి పక్కనున్న ప్రజా వేదికను కూల్చిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. సీఎంగా ఉన్నంత వరకు పరదాలు కట్టుకుని తిరిగి, ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ పెటుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ కూడా కడుపు మండిన పేదలు ఉంటారని గుర్తుంచుకోవాలన్నారు. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదని గుర్తుపెట్టుకోవాలన్నారు.
(5 / 6)
మాజీ సీఎం జగన్ తాడేపల్లి నివాస మార్గానికి విముక్తి కలిగింది. జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మార్గంలో రాకపోకలు నియంత్రించారు. తాజాగా కొత్త ప్రభుత్వం ఈ మార్గాన్ని సాధారణ ప్రజల వినియోగానికి తెరిచింది.
ఇతర గ్యాలరీలు